రింగ రింగా...జరేయంగ!

అంతెత్తు నుంచి జర్రుమని జారిపోతూ వెళ్లిపోయే పేద్ద గొట్టంలాంటి ‘టన్నెల్‌ స్లై్లడ్‌’ తెలుసుగా? అందులో ఎక్కడం మీకు ఇష్టమైతే అన్నింటికన్నా ఎక్కువ మజా ఇచ్చేదొకటి కొత్తగా మొదలైంది. అది ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌ స్లైడ్‌! మరి దాని విశేషాలేంటో తెలుసుకుందామా!

Published : 01 Jul 2016 02:04 IST

రింగ రింగా...జరేయంగ!

అంతెత్తు నుంచి జర్రుమని జారిపోతూ వెళ్లిపోయే పేద్ద గొట్టంలాంటి ‘టన్నెల్‌ స్లై్లడ్‌’ తెలుసుగా? అందులో ఎక్కడం మీకు ఇష్టమైతే అన్నింటికన్నా ఎక్కువ మజా ఇచ్చేదొకటి కొత్తగా మొదలైంది. అది ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌ స్లైడ్‌! మరి దాని విశేషాలేంటో తెలుసుకుందామా!

* లండన్‌లోని స్ట్రాట్‌ఫర్డ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఒలింపిక్‌ పార్క్‌లో ఓ టన్నెల్‌ స్లైడ్‌ను ఈమధ్యనే ప్రారంభించారు. దీని పేరు ‘ది స్లైడ్‌’. పొడవు 584 అడుగులు. ఇంత పొడవైనది ప్రపంచంలో ఇంకెక్కడా లేదట. అందుకే రికార్డు ఇచ్చారు కూడా.

* ఎత్తు నుంచి వేగంగా, గిరగిరా తిరుగుతూ జారిపోవడమంటే భయం లేని వారు దీంట్లో కేరింతలు కొడుతూ ఆనందించొచ్చు. దారిలో ఎన్నో మలుపులుంటాయి. అంత వేగంతో జారిపోతూ మలుపులు తిరుగుతుంటే ‘కెవ్వు’మని అరవకుండా ఎవరూ ఉండలేరు తెలుసా?

* పైగా అలా జారిపోతూ ఎంచక్కా చుట్టు పక్కలంతా చూడొచ్చుకూడా. ఎందుకంటే ఈ స్లైడ్‌ పైభాగమంతా గాజులాంటి ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేశారు.

* ఇలా ఎంత ఎత్తు నుంచి జారతామో తెలుసా? ఏకంగా 74 మీటర్లు. దాదాపు 242 అడుగులన్నమాట. అంటే సుమారు 24 అంతస్తుల ఎత్తు నుంచి జారినట్టే. దీంట్లో 12 మలుపులు ఉంటాయి.

* దీన్ని తయారీకి రెండు డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని తయారు చేయడానికి వాడేంత ఉక్కును, 35 వేల బోల్టుల్ని, ఫైబర్‌ గ్లాస్‌ని ఉపయోగించార్ట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని