రెండు ఖండాల్లో ఒకే దేశం!

టర్కీ దేశం ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంటుంది. * దేశమంతా కలిపినా అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే. * ఇస్తాంబుల్‌ నగరం దేశం మొత్తంలో అతి పెద్దది. ప్రపంచంలో రెండు ఖండాల్లో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఇదే.

Published : 31 Jul 2016 01:45 IST

రెండు ఖండాల్లో ఒకే దేశం!


 

రాజధాని: అంకారా
జనాభా: 7,94,63,663
విస్తీర్ణం: 7,83,356 చ.కి.మీ
భా†¾: టర్కిష్‌, కరెన్సీ: టర్కిష్‌ లీరా

 


 

* టర్కీ దేశం ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంటుంది.
* దేశమంతా కలిపినా అమెరికా టెక్సాస్‌ రాష్ట్రం కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే.
* ఇస్తాంబుల్‌ నగరం దేశం మొత్తంలో అతి పెద్దది. ప్రపంచంలో రెండు ఖండాల్లో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఇదే.
* టర్కీ ఎనిమిది దేశాల సరిహద్దులున్న దేశం.


 

జెండా: నక్షత్రం, నెలవంక ఇస్లాం మతానికి గుర్తు, ఎరుపు రంగు 17వ శతాబ్దంలో ఈ దేశాన్ని పాలించిన ఒట్టోమన్‌ రాజ్యానికి చిహ్నం.


 

* కార్లు, విమానాలు, ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం.
* టర్కీ పక్షి నిజానికి ఈ దేశానికి చెందినది కాదు. అమెరికాకు చెందింది. కానీ తొలిసారిగా టర్కీలో కనిపించడంతో పొరపాటున ఈ పేరు పెట్టారు.


 

* ప్రాచీన ప్రసిద్ధ ట్రాయ్‌ నగరం ఇక్కడిదే.
* ఒట్టోమన్‌ రాజ్యం పతనం తర్వాత 1923లో ఆధునిక టర్కీ ఏర్పడింది.


 

* ఆస్పెండోస్‌ రోమన్‌ ప్రదర్శనశాల ఎంతో ప్రాచీనమైంది. వార్షిక వేసవి ఉత్సవం ఇప్పటికీ నిర్వహిస్తారు. దీన్ని 15వేల మంది ఇక్కడ కూర్చుని చూస్తారు.
* 1502లో ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరం ఇస్తాంబుల్‌.


 

* ఒట్టోమన్‌ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లోనే 14 వందల ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు.

* ప్రముఖ రచయిత్రి అగాథా క్రిస్టీ ‘మర్డర్‌ ఆన్‌ ది ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ను ఇస్తాంబుల్‌లోనే రచించారు.
* నాలుగు వేల దుకాణాలతో ఉండే ఇక్కడి ‘గ్రాండ్‌ బజార్‌’ ప్రపంచంలోనే అతి పురాతమైన పేద్ద దుకాణ సముదాయం.


 

* ఇస్తాంబుల్‌లో పెద్ద ఎత్తున మంచు కురుస్తూ ఉంటుంది. అందుకే ఇది పర్యటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది.
* హాలండ్‌కు చిహ్నమైన తులిప్‌ పూలు టర్కీవే. ఇస్తాంబుల్‌ నుంచి నెదర్లాండ్స్‌కు ఎగుమతి అయ్యాయివి.


 

* మనం ఫోన్‌ తీయగానే ‘హలో’ అన్నట్టే టర్క్‌లు ‘మై మాస్టర్‌’ అంటారట.

* ఇక్కడి కప్పడోసియా భూగర్భ నగరాలు మంచి సందర్శక ప్రాంతాలు. వీటి నిర్మాణానికి వందల ఏళ్లు పట్టింది.



* ప్రపంచంలోనే తొలిసారిగా వ్యవసాయం మొదలైంది ఇక్కడే. దాదాపు 11వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో పంటలు పండించినట్టు ఆధారాలున్నాయి.

 

* 16, 17 శతాబ్దాల్లో ఇక్కడ కాఫీ తాగడం నేరంగా ఉండేది. కాఫీ కేంద్రాల్లో రాజకీయ విప్లవ కార్యకలాపాలు జరుగుతున్నాయనే కారణంతో వాటిని అరికట్టడానికి ఒట్టోమన్‌ సుల్తాన్‌ ఈ నిబంధన పెట్టారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని