ఈ మ్యూజియం... భూకంపానికో జ్ఞాపకం!

భవనమంతా పగుళ్లు...నేలపై, గోడలపై నెర్రెలు... ప్రకృతి వైపరీత్యం జరిగిన ఛాయలు... కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు! మరి ఎందుకిలా?

Published : 01 Aug 2016 02:04 IST

ఈ మ్యూజియం... భూకంపానికో జ్ఞాపకం!

భవనమంతా పగుళ్లు...నేలపై, గోడలపై నెర్రెలు... ప్రకృతి వైపరీత్యం జరిగిన ఛాయలు... కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు! మరి ఎందుకిలా?క్కడ అడుగు పెట్టగానే నేలపై బీటలు కనిపిస్తాయి. నిర్మాణాలన్నీ కుంగిపోయినట్టు ఉంటాయి. భూకంపం వచ్చి భూమంతా నెర్రెలతో ముక్కలయ్యిందనిపించే ఆనవాళ్లతో ఉంటుంది. ఇవన్నీ ఓ వింత మ్యూజియం సంగతులు. ఎందుకంటే ఆ మ్యూజియాన్నే భూకంప జ్ఞాపకాల కోసం రూపొందించారు. దాని పేరు ‘వెన్‌చువన్‌’. చూడాలంటే చైనాలోని కుషాన్‌ పట్టణానికి వెళ్లాల్సిందే.* దాదాపు మూడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ మ్యూజియాన్ని విచిత్రంగా నిర్మించారు. భవనమంతా ఎగుడుదిగుడుగా నేలలోకి చొచ్చుకునిపోయినట్టుగా కట్టారు. భవంతి పైకప్పు కూడా పగుళ్లతో ఉన్నట్టు, వాటిలో పచ్చని మొక్కలు మొలకెత్తినట్టు కావాలని నిర్మించారు. నిజంగా భూకంపం వస్తే ఇళ్లు, భవంతులు ఎలా దెబ్బతింటాయో అలాగే ఉండేలా ఈ మ్యూజియాన్ని శ్రద్ధగా తీర్చిదిద్దారన్నమాట.

* ఈ మ్యూజియం భవన ఆకృతిని కాయ్‌ యోంజీ అనే కళాకారుడు రూపొందించాడు.* ఇంతకీ దీన్ని ఎందుకు నిర్మించారో తెలుసా? 2008లో ఇక్కడ భూకంపం వచ్చింది. భారీ నష్టం వాటిల్లింది. 70 వేల మందికిపైగా జనాలు మరణించారు. 18 వేల మంది జాడే దొరకలేదు. లక్షలాది మంది గాయాలపాలయ్యారు. ఇళ్లు కూలిపోయి లక్షల మంది ఆవాసాన్ని కోల్పోయారు. ఈ విషాదానికి గుర్తుగా, చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా 2013లో ఇదే ప్రాంతంలో ఈ మ్యూజియాన్ని రూపొందించారు.* లోపలికి వెళితే భూకంప బీభత్సాన్ని ప్రతిబింబించే వేలాది ఫొటోలు, రకరకాల శిల్పాలు, ఆయిల్‌ పెయింటింగ్స్‌ కనిపిస్తాయి.

* ఇక్కడికి ఏటా వేలాది మంది పర్యటకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని