పాప్‌కార్న్‌ పుట్టిల్లు! చాక్లెట్‌ నట్టిల్లు!!

పచ్చ, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండి మధ్యలో ‘కోట్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌’ ఉంటుంది. ఆకుపచ్చ ఆశావహ దృక్పథానికి, తెలుపు ఐక్యతకు, ఎరుపు రంగు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికీ ప్రతీకలు.

Published : 07 Aug 2016 01:38 IST

మెక్సికో
పాప్‌కార్న్‌ పుట్టిల్లు! చాక్లెట్‌ నట్టిల్లు!!


 రాజధాని: మెక్సికో నగరం

జనాభా: 11,95,30,753
విస్తీర్ణం: 19,72,550 చదరపు కిలోమీటర్లు
భాష: స్పానిష్‌
కరెన్సీ: మెక్సికన్‌ పెసో


జెండా

* పచ్చ, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండి మధ్యలో ‘కోట్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌’ ఉంటుంది. ఆకుపచ్చ ఆశావహ దృక్పథానికి, తెలుపు ఐక్యతకు, ఎరుపు రంగు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికీ ప్రతీకలు.

*  అమెరికాలో ఇప్పుడు అతిపెద్ద రాష్ట్రం టెక్సాస్‌. అది 1836లో మెక్సికో నుంచి విడివడి స్వతంత్రం ప్రకటించుకుంది. తర్వాత 1845లో అమెరికాలో కలిసిపోయింది.

* మెక్‌డొనాల్డ్స్‌ బర్గర్లపై వాడే నువ్వుల్లో 75శాతం ఇక్కడే సాగవుతాయి.


*అమెరికా, మెక్సికోలది ప్రపంచంలోనే అతి పెద్ద రెండో సరిహద్దు రేఖ. దీని నుంచి చాలా మంది మెక్సికన్లు సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాకు వలస వెళుతుంటారు.

* ఈ దేశం మొత్తానికి ఒకే ఒక ఆయుధాల దుకాణం ఉంది. మిగిలినవన్నీ అమెరికా నుంచి అక్రమంగా దిగుమతి అవుతాయి.

* ఏటా అమెరికా, మెక్సికో సరిహద్దులో రెండు దేశాలకూ ఒక వాలీబాల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ కోర్టు సగభాగం ఆ దేశంలో, సగ భాగం ఈ దేశంలో ఉంటుంది.

* ఇక్కడి కరెన్సీ నోట్లపై బ్రెయిలీ లిపిలో గుర్తులు ఉంటాయి.


* మెక్సికో జనాభాపరంగా పదకొండో అతిపెద్ద దేశం.

* అధికారిక భాషలు 68

* మెక్సికో నగరం ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల నగరాల్లో ఒకటి.

* పిరమిడ్లనగానే అందరికీ ఈజిప్టు గుర్తొస్తుందిగానీ ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్‌ ఉన్నది మాత్రం ఇక్కడి చోలులాలోనే.

* ఇక్కడి కళాకారులు తమ కళారూపాల్ని ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు.

* ఈ దేశ 34వ అధ్యక్షుడు పెడ్రో కేవలం ఒక గంటపాటు మాత్రమే అధికారంలో ఉన్నారు.


* మనం ఇష్టంగా తినే పాప్‌కార్న్‌, చాక్లెట్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ దేశమే. మిరపకాయ పుట్టింది కూడా ఇక్కడే.

* వూబకాయులు అధికంగా గల దేశం.

* అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఒకప్పుడు మెక్సికోదే. 1848లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం తర్వాత అది అమెరికా సొంతమైంది.

* 1945లో ఇక్కడొక రైతు పొలంలో అకస్మాత్తుగా అగ్ని పర్వతం బయటకు పుట్టు కొచ్చింది. ఒక్కవారంలోనే ఐదంతస్తుల భవనమంత, ఏడాదిలోగా 1,100 అడుగుల ఎత్తు పెరిగిపోయింది.


* అస్సలు జుట్టు లేకుండా ఉండే జోలోటిజ్‌క్యుంట్లి జాతి శునకాలు ఇక్కడివే. ఇది ఈ దేశ జాతీయ శునకం కూడా.

* ‘వాల్కెనో రేబిట్‌’ అనేది ఇక్కడ మాత్రమే కనిపించే అరుదైన కుందేలు.

* ప్రపంచంలో ఉన్న జీవ జాలంలో 10 నుంచి 12శాతం ఇక్కడే ఉంది. ఇక్కడ మొత్తం రెండు లక్షలకు పైగా జీవులు ఉన్నాయి. 67జాతీయ పార్కులు కూడా ఉన్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని