గాజు గొట్టమండీ... జర్రుమని జారొచ్చండి!!

అదో జారుడు బల్ల... వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది... పేరు స్కైస్లైడు... ఈమధ్యే ప్రారంభమైంది... మరి దీని గురించి తెలుసుకోకపోతే ఎలా?

Published : 08 Aug 2016 01:36 IST

గాజు గొట్టమండీ... జర్రుమని జారొచ్చండి!!

అదో జారుడు బల్ల... వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది... పేరు స్కైస్లైడు... ఈమధ్యే ప్రారంభమైంది... మరి దీని గురించి తెలుసుకోకపోతే ఎలా?

జారుడు బల్ల తెలుసుగా. పైకి ఎక్కి రయ్యిమంటూ కిందికి జారిపోవచ్చు. అలాంటిదే ఈ స్కైస్లైడు. కానీ ఇదుండేది ఓ ఎత్తయిన భవంతిలో. అందుకే దీనికీ పేరు పెట్టారన్నమాట. చూడాలంటే అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌కి వెళ్లాల్సిందే.
* వెయ్యి అడుగుల ఎత్తయిన భవనంలో ఏర్పాటు చేసిన ఈ రైడు గమ్మత్తుగా ఉంటుంది. ఈ జారుడు బల్లను 70వ అంతస్తు నుంచి దాని కింది అంతస్తుకు జారేట్టు అతికించారు. మధ్యలో గాల్లో వంపు తిరిగి భలేగా ఉంటుంది.
* మొత్తం 45 అడుగుల పొడవుండే ఈ స్లైడు అచ్చంగా పారదర్శకమైన గాజుతో చేసిందే. దీనిపై జర్రున జారుకుంటూ చుట్టూ పరిసరాల్ని చూడొచ్చు.* ఈ స్లైడు గాజుతో ఉండటం, గాల్లోకి వంపు తిరగడం వల్ల నిజంగానే గాల్లో తేలినట్టు, అంత ఎత్తు నుంచి కింద పడిపోతున్నట్టు వింత అనుభూతి కల్గుతుంది. అందుకే దీనిపై ఎక్కాలంటే ఎంతో గుండెధైర్యం కావాలి.
* మరి గాజు పగిలిపోదా? లేదు ఎందుకంటే ఒకటిన్నర అంగుళాల మందంతో ఉన్న దృఢమైన బుల్లెట్‌ఫ్రూప్‌ గాజును వాడారు. ఇది రెక్టర్‌ స్కేలుపై 8.0 భూకంపం నమోదైనా, గంటకు 110 మైళ్ల వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు.
* ఇప్పటికే ఎంతో మంది సాహసికులు ఈ స్లైడుపై జారి తమ సరదా తీర్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని