మర సాలీడొచ్చింది... మహ బాగా నచించంది!

నాలుగంతస్తుల భవనం ఎంతుంటుందో తెలుసుగా? అంత ఎత్తుండే ఓ పెద్ద సాలీడు గునగునా నడుచుకుంటూ వీధుల్లోకి వచ్చేసింది. ఇక్కడెక్కడా కాదు లెండి. ఫ్రాన్స్‌ దేశంలో. కానీ దాన్ని చూసి ఎవరూ భయపడలేదు సరికదా, కేరింతలు కొడుతూ చుట్టూ మూగారు. ఎందుకో తెలుసా? అది నిజం సాలీడు కాదు. మర సాలీడు. దాని సంగతులివిగో..

Published : 13 Aug 2016 00:56 IST

మర సాలీడొచ్చింది... మహ బాగా నచించంది!

సాలీడు ఎంతుంటుంది?  మహా అయితే అంగుళమంత...  కానీ ఏకంగా 40 అడుగులుపైనే ఉంటే? అమ్మో... అనిపిస్తోందా?  అయితే చదవండి మరి!

నాలుగంతస్తుల భవనం ఎంతుంటుందో తెలుసుగా? అంత ఎత్తుండే ఓ పెద్ద సాలీడు గునగునా నడుచుకుంటూ వీధుల్లోకి వచ్చేసింది. ఇక్కడెక్కడా కాదు లెండి. ఫ్రాన్స్‌ దేశంలో. కానీ దాన్ని చూసి ఎవరూ భయపడలేదు సరికదా, కేరింతలు కొడుతూ చుట్టూ మూగారు. ఎందుకో తెలుసా? అది నిజం సాలీడు కాదు. మర సాలీడు. దాని సంగతులివిగో..
* ఫ్రాన్స్‌లోని న్యాంట్స్‌ వీధుల్లో ఓ పెద్ద సాలీడును ప్రదర్శించారు. యంత్రాల సాయంతో కదిలే అది అచ్చం నిజం సాలీడులాగే పెద్ద పెద్ద కాళ్లతో నడుస్తూ ఆశ్చర్యపరిచింది.
* చుట్టూ జనం మూగి ఉన్నప్పుడు అది దాని కాళ్ల నుంచి ఒక్కసారిగా పొగమంచును ఎగజిమ్మింది. దాంతో అక్కడున్న పిల్లలంతా తెగ సందడి చేసేశారు.
* ఆ సాలీడు పేరు కుమో. ఎనిమిది కాళ్లతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడిచేందుకు వీలుగా దాని శరీరం కింద యంత్రాన్ని అమర్చారు. ఆ యంత్రానికి వాహనంలాగా టైర్లు కూడా ఉంటాయన్నమాట. అయితే దీన్ని నడిపేందుకు మాత్రం డజను మంది మనుషులు కావాల్సిందే.
* న్యాంట్స్‌లోనే ఉన్న ‘లా మెషీన్‌’ అనే సంస్థ దీన్ని రూపొందించింది. అందుకు ఉక్కు, చెక్కల్ని ఉపయోగించింది. దీన్ని చేసేందుకు 40 మంది మనుషులు ఏకంగా ఏడాదిపాటు కష్టపడ్డారు తెలుసా! ఇదేమో 38 వేల కేజీల బరువు, 40 అడుగులకుపైనే ఎత్తుంది.
* అప్పట్నుంచి ఇది జపాన్‌, చైనాలాంటి దేశాల్లో ఎక్కడ ఉత్సవాలు జరిగితే అక్కడకు వెళ్లి వీధుల్లో నడుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అలా దేశాలన్నీ తిరుగుతూ ఏడేళ్లకు మళ్లీ సొంత చోటికి వచ్చిందిట. అన్నట్టు ఇది వచ్చే ఏడాది అమెరికా బయల్దేరుతోంది.
* ఇంతకీ దీన్ని ఎందుకు చేశారు? ‘సాలీళ్లు చాలా ఉపయోగకరమైన జీవులే. అయినా వాటిని ­రికే చంపేస్తుంటారు. మరి కొందరేమో భయపడిపోతుంటారు. అలా కాకుండా చేయడానికే కుమోను తయారు చేశాం’ అంటున్నారు, దాన్ని చేసినవాళ్లు. వీళ్లు అంతక్రితం కూడా ఇలాగే ఓ పేద్ద గుర్రాన్ని, ఏనుగునీ కూడా తయారు చేసి ప్రదర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని