సర్పాస దీవి...విమానాశ్రయాస ఠీవి!

బ్రెజిల్‌లోని రియోలో విశ్వక్రీడల పోటీలు ‘ఒలింపిక్స్‌’ తెగ సందడిగా జరుగుతున్నాయి కదా? ఆతిథ్యం ఇస్తున్న ఈ దేశ సంగతులేంటో తెలుసుకుందామా!

Published : 14 Aug 2016 01:12 IST


సర్పాస దీవి...విమానాశ్రయాస ఠీవి!

బ్రెజిల్‌


రాజధాని: బ్రెసిలియా
జనాభా: 20,53,38,000
విస్తీర్ణం: 85,15,767 చ.కి.మీ
భాష: పోర్చుగీస్‌ కరెన్సీ: రియాల్‌


* బ్రెజిల్‌లోని రియోలో విశ్వక్రీడల పోటీలు ‘ఒలింపిక్స్‌’ తెగ సందడిగా జరుగుతున్నాయి కదా? ఆతిథ్యం ఇస్తున్న ఈ దేశ సంగతులేంటో తెలుసుకుందామా!
* బ్రెజిల్‌... దక్షిణ అమెరికాలో అతి పెద్ద దేశం. జనాభా, వైశాల్య పరంగా ఇది ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది.
* అట్లాంటిక్‌ సముద్ర తీరంలోని బ్రెజిల్‌ 7,491 కిలోమీటర్ల సముద్ర తీర రేఖతో ఉంటుంది.
* ఇక్కడి జనాభాలో ఎక్కువ శాతం పోర్చుగీస్‌లోనే మాట్లాడుతారు.


* బ్రెజిల్‌వుడ్‌ చెట్టు పేరు మీదుగా ఈ దేశానికి ఈ పేరొచ్చింది.
* చిలీ, ఈక్వెడార్‌ మినహా దక్షిణ అమెరికా దేశాలన్నింటి సరిహద్దుల్నీ పంచుకుంటుందిది.
* ప్రపంచంలో రెండో పొడవైన నది... అమెజాన్‌ బ్రెజిల్‌ మీదుగా ప్రవహిస్తుంది.
* ఈ దేశ రాజధాని బ్రెసిలియాను పైనుంచి చూస్తే విమానం ఆకారంలో ఉంటుంది.
* జీవకోటికి 20 శాతానికిపైగా ప్రాణవాయువును అందిస్తున్న అమెజాన్‌ అడవి 60 శాతం ఈ దేశంలోనే ఉంది.
* ఇక్కడికి ఏటా అరవై లక్షల మంది పర్యటకులు వస్తుంటారు.
* ఈ దేశ ప్రజలు ఫుట్‌బాల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతీ నగరంలో ఒక్క ఫుట్‌బాల్‌ మైదానమైనా ఉంటుంది.


జెండా: ఆకుపచ్చ అమెజాన్‌ అడవికి, పసుపు డైమండ్‌ సంపదకు గుర్తు. నీలం వృత్తం, దానిపై ఉన్న నక్షత్రాలు బ్రెజిల్‌ స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేస్తాయి







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని