పల్లెను పజిల్‌గా మార్చిన భూకంపం!

అదో పురాతనమైన పల్లె... ఒకప్పుడు వందలాది ఇళ్లతో ఉండేది... ఇప్పుడు వీధులు మాత్రమే కనిపిస్తాయి... అయినా ఇదో వింత పర్యటక ప్రాంతం... ఎక్కడుందిది? ఏమా విశేషాలు! చదునుగా ఉన్న ఓ పెద్దబండరాయికే పగుళ్లు వచ్చాయా? బీటలు వారి ఇలా మారిందా? అన్నట్టు ఉంటుంది, దూరం నుంచి చూస్తే. కానీ కొంచెం దగ్గరకు వెళ్లి చూస్తే పత్రికల్లో వచ్చే ‘దారేది’ పజిల్‌లా తికమక దారులతో కనిపిస్తుందిది. కానీ ఇది ఒకనాడు జనంతో కళకళలాడిన గ్రామమే. మరి ఇలా నిశ్శబ్దంగా ఉంది అంటే? వివరాలు చదివేయండి.

Published : 17 Aug 2016 01:07 IST

పల్లెను పజిల్‌గా మార్చిన భూకంపం!

అదో పురాతనమైన పల్లె... ఒకప్పుడు వందలాది ఇళ్లతో ఉండేది... ఇప్పుడు వీధులు మాత్రమే కనిపిస్తాయి... అయినా ఇదో వింత పర్యటక ప్రాంతం... ఎక్కడుందిది? ఏమా విశేషాలు!దునుగా ఉన్న ఓ పెద్దబండరాయికే పగుళ్లు వచ్చాయా? బీటలు వారి ఇలా మారిందా? అన్నట్టు ఉంటుంది, దూరం నుంచి చూస్తే. కానీ కొంచెం దగ్గరకు వెళ్లి చూస్తే పత్రికల్లో వచ్చే ‘దారేది’ పజిల్‌లా తికమక దారులతో కనిపిస్తుందిది. కానీ ఇది ఒకనాడు జనంతో కళకళలాడిన గ్రామమే. మరి ఇలా నిశ్శబ్దంగా ఉంది అంటే? వివరాలు చదివేయండి.

* ఇదంతా ఇటలీలోని సిసిలీ అనే దీవిలోని కొండ పక్కన ఉన్న ఒకనాటి గిబెలినా అనే గ్రామం గురించి.

* ఈ గ్రామమే ఇప్పుడు ఎత్తయిన సిమెంట్‌ గోడలతో కట్టిన కళారూపంగా మారింది. దీని పేరు ‘క్రెట్టో డె బుర్రీ’. దాదాపు ఎనిమిది వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందిది.

* ఇంతకీ దీని గొప్పేంటి అంటే చరిత్ర తెలుసుకోవాల్సిందే. ఇక్కడ 1968లో ఓ పెద్ద భూకంపం వచ్చింది. చుట్టుపక్కలంతా భారీ ఆస్తి నష్టం జరిగింది. చెట్లు, పుట్టలు, మేడలు, మిద్దెలు అన్నీ కూలిపోయాయి. ఉండటానికి చోటులేక ఆ గ్రామస్థులు నానా తంటాలుపడ్డారు. కొంతకాలానికి ఈ ­రికి 20 కిలోమీటర్ల దూరంలో ఆధునిక సౌకర్యాలతో అందమైన ఇళ్లతో మరో ­రు నిర్మించుకున్నారు. ఇదే కొత్త గిబెలినాగా మారింది.

* కానీ భూకంపం దాటికి అతలాకుతలమైన ఆనాటి గిబెలినా ­రికి గుర్తుగా ఈ గ్రామాన్నే కళాఖండంగా మార్చాలనుకున్నాడు ప్రముఖ ఇటలీ కళాకారుడు ఆల్బర్ట్‌ బుర్రీ. 1983 నుంచి ఆ పని మొదలుపెట్టాడు. పడిపోయిన చెట్లు, కుప్పకూలిన ఇళ్లు, ఇతర సామగ్రి ఇలా శిథిలమైనవాటన్నింటినీ అలాగే ఉంచి వాటిపైనే సిమెంట్‌ వేశారు. ప్రాచీనమైన ఆ ­రి నిర్మాణం ఏమాత్రం దెబ్బతినకుండా ఇళ్లవరుస, వీధులు అలాగే ఉండేలా తీర్చిదిద్దారు. అదే ఇప్పుడు చుట్టూ సిమెంట్‌ గోడల తికమక దారులతో ఓ పజిల్‌లా, కళాఖండంగా తయారైంది.

* అప్పట్లో ఆయన మొదలుపెట్టిన ఈ కళాకృతి ఈమధ్యే పూర్తయ్యింది.

* బోలెడు మంది పర్యటకులు పురాతన గిబెలినా వూరి వీధుల్లో నడుస్తూ, పాత చరిత్రను తెలుసుకుంటూ తమ సరదా తీర్చుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని