వూయల వూగేద్దామా... సాహసం చేసేద్దామా!

అదో దేశరాజధాని... అయినా ఒక్కసారిగా చిన్నగా మారిపోతుంది... మన పాదాల కన్నా బుల్లిగా కనిపిస్తుంది... ఎలా అంటే? ఓ ఎత్తయిన వూయల ఎక్కితే... ఇంతకీ ఎక్కడుంది? ఏమా సంగతులు?

Published : 31 Aug 2016 00:49 IST

వూయల వూగేద్దామా... సాహసం చేసేద్దామా!

  అదో దేశరాజధాని... అయినా ఒక్కసారిగా చిన్నగా మారిపోతుంది... మన పాదాల కన్నా బుల్లిగా కనిపిస్తుంది... ఎలా అంటే? ఓ ఎత్తయిన వూయల ఎక్కితే... ఇంతకీ ఎక్కడుంది? ఏమా సంగతులు?

వూయల్లో ఎక్కడమంటే మహా సరదాగా ఉంటుంది. కానీ ఒక వూయల్లో ఎక్కాలంటే మాత్రం ఎంతో గుండె ధైర్యం కావాలి. ఆ వూయల్లో వూగడమంటే ఓ సాహసమే. ఎందుకంటే అది నేల నుంచి వంద మీటర్ల ఎత్తులో ఉంటుంది.
* దీని పేరు ‘ఓవర్‌ ది ఎడ్జ్‌’. ఈ మధ్యే ప్రారంభమైంది. సరదాగా ఎక్కాలనుందా? అయితే నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కి వెళ్లాల్సిందే.
* ఇక్కడి ‘ఐజే’ అనే నది తీరంలో కొత్తగా ‘ఆడమ్స్‌ టవర్‌’ అనే ఓ అబ్జర్వేషన్‌ భవంతిని నిర్మించారు. రెస్టారెంట్లతో, రకరకాల ప్రదర్శనలతో పర్యటకుల్ని ఆకట్టుకునే ఈ టవర్‌పైనే ఇప్పుడీ వూయలను ఏర్పాటు చేశారు.

* ఇది మామూలుగా పార్కుల్లో కనిపించే వూయలలానే ఉన్నా 330 అడుగుల ఎత్తులో ఉండటమే దీని అసలు ప్రత్యేకత. అంటే ముప్ఫై అంతస్తుల ఎత్తయిన భవంతిపై నుంచి కిందికి వూగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట.
*ఇందులో కూర్చుని వూగుతుంటే ఒక్కసారిగా గాల్లో ఎగిరిపోతాం. కింద ఉన్న నది నీళ్లను చూస్తే గుండె గుభేలుమంటుంది. చుట్టూ ఉండే ఇళ్లన్నీ బుల్లి బుల్లిగా కనిపిస్తాయి. ఆకాశంలో వూగుతున్న వింత అనుభూతి కలుగుతుంది.
* మరి జారిపడిపోతే? ఆ భయం లేదు. సాహసికులు తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలి. చిన్నవారికి అసలు అనుమతి ఉండదు.
* మెషీన్‌ ఆధారంగా నడిచే ఈ వూయలలో ఒకేసారి నలుగురు వూగొచ్చు. కావాలంటే మనకు నచ్చినంత వేగంతో వూగొచ్చు.
* ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇది వేలాది మంది పర్యటకుల్ని ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని