గడుసు పిల్లి బాబోయ్‌!

ఈ పిల్లి పేరు దిద్గా. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన రాబర్ట్‌ డాల్వెట్‌ దీని యజమాని. దిద్గా భలే భలే ఫీట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందుకాళ్లు పైకెత్తి, వెనుక కాళ్లపై ....

Published : 10 Sep 2016 01:18 IST

భలే రికార్డు
గడుసు పిల్లి బాబోయ్‌!

పిల్లి పేరు దిద్గా. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన రాబర్ట్‌ డాల్వెట్‌ దీని యజమాని. దిద్గా భలే భలే ఫీట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందుకాళ్లు పైకెత్తి, వెనుక కాళ్లపై నిలబడింది. అలాగే కొంత దూరం నడిచేసింది. స్కేట్‌బోర్డ్‌పై నుంచుని జర్రున జారేసింది. అడ్డుగా ఉన్న కర్రల పై నుంచి ఎగిరి మళ్లీ సరిగ్గా స్కేట్‌బోర్డ్‌పైకే దూకింది. పిల్లిమొగ్గలు కొట్టింది. ఇలా 24 రకాల ఫీట్లు చేసింది. ఇవన్నీ చేసింది కేవలం ఒక్క నిమిషంలోనే. తక్కువ సమయంలో ఎక్కువ ఫీట్లు చేసిన పిల్లిగా దర్జాగా గిన్నిస్‌బుక్‌లోనూ చోటు సంపాదించేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని