గుమ్మాడమ్మా గుమ్మాడీ... ఈరోజు నీదే అమ్మాడీ!

పసుపచ్చని గుమ్మడి పండు... చూసేందుకు భలే ఉంటుంది... మరి ఓచోట దానికీ ఓ రోజుంది... ఎక్కడో, ఎలా జరుపుకుంటారో చదివేద్దామా? పండు కాని పండంటే మనకు గుమ్మడిపండే గుర్తొస్తుంది. ఇది మొదట పుట్టింది ఉత్తర అమెరికా...

Published : 26 Oct 2016 01:34 IST

పసుపచ్చని గుమ్మడి పండు... చూసేందుకు భలే ఉంటుంది...
మరి ఓచోట దానికీ ఓ రోజుంది... ఎక్కడో, ఎలా జరుపుకుంటారో చదివేద్దామా?
పండు కాని పండంటే మనకు గుమ్మడిపండే గుర్తొస్తుంది. ఇది మొదట పుట్టింది ఉత్తర అమెరికా ఖండంలోనేనట. అందుకు గుర్తుగానే అమెరికన్లు ఏటా ఈ రోజు (అక్టోబరు 26)ను ‘నేషనల్‌ పంప్‌కిన్‌డే’గా జరుపుకుంటారు.
* అక్కడ ఎక్కువగా పండే ఈ కాయతో ఈ రోజు రకరకాల ఆహార పదార్థాలు వండుకుంటారు. వీటి గుజ్జుతో బిస్కెట్లు, బ్రెడ్‌లు, క్యాండీలు, సూప్‌లు, కేకుల్లాంటి వంటకాల్ని చేసుకుంటారు. వాటిని బంధువులు, ఇరుగుపొరుగు వారితో పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
* ఈ సందర్భంగా అక్కడ పెద్ద పెద్ద గుమ్మడికాయల ప్రదర్శనలు, పోటీలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. వీటికి రంగులద్దడం, అందంగా చెక్కడం లాంటివీ చేస్తారు.
* అమెరికాలో ఏటా దాదాపుగా 800 కోట్ల కేజీలకు పైగా గుమ్మడికాయలు సాగవుతాయి.
* క్రీ॥పూ 7000-5000 సంవత్సరాల మధ్యలోనే ఇవి ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఉత్తరమెరికా ఖండంలోని మెక్సికో దేశంలో తొలుత ఇవి పండినట్లు చెబుతారు.
* అన్నట్లు... ఏటా అక్టోబరు 31న అమెరికా సహా చాలా దేశాల్లో ‘హలోవీన్‌డే’కూడా జరుపుకుంటారు. గుమ్మడికాయలకి కళ్లు, ముక్కు, నోరు చెక్కి లోపల దీపం ఉంచి ఇంటి బయట ఉంచుతారు. పిల్లలు రకరకాల వేషధారణాలువేసుకుని ఆనందిస్తారు.
* పాదుకు కాసే ఈ కాయల్లో విటమిన్‌ ఏ, సీ, బీ6, ఐరన్‌లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని