ప్రపంచంలోనే ధనిక దేశం!

ప్రపంచ సంపన్న దేశాల్లో మొదటిది. ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం 68 లక్షల రూపాయలకు పైమాటే. * ఈ దేశం వాస్తవానికి ఆసియా ఖండానికి చెందినదే కానీ ఉన్నదేమో మధ్యప్రాచ్యంలో. * ఈ దేశం మొత్తం మన త్రిపుర రాష్ట్రం అంత ఉంటుందంతే. దాన్ని 8 మున్సిపాలిటీలుగా, 98 జోన్‌లుగా విభజించారు.

Published : 06 Nov 2016 00:40 IST

ప్రపంచంలోనే ధనిక దేశం!

*ప్రపంచ సంపన్న దేశాల్లో మొదటిది. ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం 68 లక్షల రూపాయలకు పైమాటే.
* ఈ దేశం వాస్తవానికి ఆసియా ఖండానికి చెందినదే కానీ ఉన్నదేమో మధ్యప్రాచ్యంలో.
* ఈ దేశం మొత్తం మన త్రిపుర రాష్ట్రం అంత ఉంటుందంతే. దాన్ని 8 మున్సిపాలిటీలుగా, 98 జోన్‌లుగా విభజించారు.


జెండా : జెండాలో కుంకుమ రంగు దేశం కోసం రక్తం చిందించిన అమరుల త్యాగానికి, తెలుపు శాంతికి గుర్తు.

రాజధాని : దోహా
అధికారిక భాష : అరబిక్‌
జనాభా : 22,58,283
విస్తీర్ణం : 11,586 చదరపు కిలోమీటర్లు
కరెన్సీ : ఖతారీ రియాల్‌


* బిరియానీ అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టం. మధ్యాహ్న భోజనం అనంతరం ‘కరాక్‌ టీ’ తాగడం ఇక్కడి వారందరికీ అలవాటు.


* 89 శాతం మంది అక్షరాస్యులే.
* ద్వీపకల్ప దేశమైన దీనిలో చాలా భాగం ఎడారే. అయితే చమురు, సహజవాయువులు ఎక్కువగా దొరుకుతాయి. ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్‌పీజీ)ని అధికంగా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే దేశమిది.
* దోహా దగ్గర సముద్రంలో ‘దపర్ల్‌’ పేరుతో ఓ కృత్రిమ దీవిని తయారు చేశారు. దానిపై అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాల్ని కట్టారు. 12,000 మంది ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. సముద్రపు అందాల్ని చూస్తూ ఇక్కడున్న షాపింగ్‌ కాంప్లెక్సుల్లో కావల్సిన వాటిని కొనుక్కోవచ్చు.
* 1971లో ఇది యూకే నుంచి స్వాతంత్య్రం పొందింది.


* ఈ బుల్లి దేశానికి మొత్తం 11,800 మంది సైన్యం ఉన్నారు.
* దోహాలో ఉన్న హామద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో తొమ్మిదోది.
* శీతకాలంలో ఇక్కడ కనిష్ఠంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత, వేసవి కాలంలో గరిష్ఠంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
* ఇక్కడ శుక్రవారం అంతా ప్రార్థనల్లో పాల్గొంటారు. అందుకే మధ్యాహ్నం వరకు దుకాణాలు సైతం తెరవరు.
* ఇక్కడున్న వారిలో 80 శాతం మంది విదేశీయులే. 18 శాతం మంది భారతీయులున్నారు.
* దుస్తుల విషయంలో ఇక్కడ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తారు. స్త్రీపురుషులెవరైనా మోకాళ్ల కింద వరకు దుస్తులు ధరించాలి. మహిళలు కచ్చితంగా చేతులు కప్పుకోవాలి.
* రాజధాని నగరంలో ఉన్న తేలియాడే మ్యూజియం ‘మెష్రిబ్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ సెంటర్‌’ ఇక్కడ ప్రధాన పర్యటక ఆకర్షణ.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని