నీటిలో క్రిస్మస్‌ చెట్టు... చూద్దామా ఆ కనికట్టు?

క్రిస్మస్‌ సందడి మొదలైంది..క్రిస్మస్‌ చెట్లని రకరకాల కాంతులతో ఏర్పాటు చేస్తున్నారు... అయితే ఆకట్టుకునే రంగుల్లో ఇవి సముద్రాల్లోనూ ఉన్నాయి...కానీ ఇవి ప్రాణమున్న చెట్లు.. నమ్మకపోతే వివరాలు చదవండి!

Updated : 09 Dec 2022 13:56 IST

క్రిస్మస్‌ సందడి మొదలైంది..క్రిస్మస్‌ చెట్లని రకరకాల కాంతులతో ఏర్పాటు చేస్తున్నారు... అయితే ఆకట్టుకునే రంగుల్లో ఇవి సముద్రాల్లోనూ ఉన్నాయి...కానీ ఇవి ప్రాణమున్న చెట్లు.. నమ్మకపోతే వివరాలు చదవండి!

క్కడున్న ఫొటోల్ని చూసి ‘అరె క్రిస్మస్‌ చెట్లను భలే గమ్మత్తుగా అలంకరించారే’ అనుకుంటే కేకులో కాలేసినట్టే. ఎందుకంటే ఇవో సముద్ర పురుగులు.

* క్రిస్మస్‌ చెట్లలా ఉంటాయి కాబట్టే వీటిని క్రిస్మస్‌ ట్రీ వర్మ్స్‌గా పిలుస్తారు.

* ప్రపంచవ్యాప్తంగా సముద్రాలన్నింటిలో పగడపు దిబ్బల్లో జీవించే వీటి ఆకారం ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. నీటి బొరియల్లో ఉండే ఇవి హఠాత్తుగా పైకి రాగానే వాటి చుట్టూ ఉన్న వెంట్రుకల్లాంటి టెంటకిల్స్‌, ఈకలు రింగులు తిరుగుతూ నెమలి పురివిప్పినట్టు తెరుచుకుంటాయి. రంగు రంగుల్లో రెండు కిరీటాల్లా పొడుచుకొస్తాయి. చూడ్డానికి అచ్చంగా క్రిస్మస్‌ ట్రీలా ఉంటుంది. ఈ జీవి కదులుతూ ఉంటే క్రిస్మస్‌ చెట్లు ఇలా తిరుగుతున్నాయా అన్నంత భ్రమ కల్గుతుంది.

* పసుపు, నీలం, తెలుపు, కాషాయం ఇలా రంగు రంగుల్లో ఒకటిన్నర అంగుళాల పరిమాణంలో గమ్మత్తుగా ఉంటాయివి.

* వీటి శాస్త్రీయ నామం సైరోబ్రాంకస్‌ జైగాంటియస్‌.

* ఇది బుల్లిదే అయినా తెలివి మాత్రం అంతా ఇంతా కాదు. శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి కాల్షియం కార్బొనేట్‌తో ప్రత్యేక కవచం లాంటిది తయారుచేసుకుంటుంది. అంతేకాదు ఇది చిన్న అలికిడి అయినా గుర్తిస్తుంది. దానిపై నీడ పడినా పసిగట్టేస్తుంది. సురక్షిత స్థలానికి తుర్రుమంటుంది.

* తీరం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఆహారాన్ని తీసుకుంటుంది. చిన్న చిన్న మొక్కల్ని తిని కడుపు నింపుకునే ఈ చెట్టు ప్రాణి వేటకు మొదలయ్యే ముందే తన ఈకతో నీటిని పరీక్షిస్తుందిట. శత్రువులున్నారేమోనని జాగ్రత్తపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని