ఇంట్లో పత్రికలు కాదు... పత్రికలే ఇల్లు!

ఇళ్లు దేనితో కడతారు? సిమెంట్‌, ఇసుక కలిపి... లేదా ఏదైనా దృఢమైన పదార్థంతో... కానీ ఒక దగ్గర వార్తా పత్రికలతో కట్టారు... ఇప్పుడు కాదు ఎప్పుడో 90 ఏళ్ల క్రితమే... ఇప్పటికీ బాగానే ఉందా ఇల్లు!

Published : 24 Jan 2017 01:28 IST

ఇంట్లో పత్రికలు కాదు... పత్రికలే ఇల్లు!

ఇళ్లు దేనితో కడతారు? సిమెంట్‌, ఇసుక కలిపి... లేదా ఏదైనా దృఢమైన పదార్థంతో... కానీ ఒక దగ్గర వార్తా పత్రికలతో కట్టారు... ఇప్పుడు కాదు ఎప్పుడో 90 ఏళ్ల క్రితమే... ఇప్పటికీ బాగానే ఉందా ఇల్లు!
దివేసిన దిన పత్రికల్ని ఏం చేస్తాం? ఎంతో కొంతకు తూకానికి అమ్మేస్తాం. లేదంటే మూలన పడేస్తాం. కానీ ఒకాయన మాత్రం ఏకంగా పేపర్‌ హౌస్‌ను కట్టేశారు. ఇదేదో బొమ్మరిల్లు కాదు. ఉండటానికే.
* చూడాలంటే అమెరికాలోని మాసాచుసెట్స్‌ దగ్గర్లోని పిజియన్‌ హిల్‌ స్ట్రీట్‌కు వెళ్లాల్సిందే. దూరం నుంచి చూస్తే ఏదో సాదాసీదా ఇల్లులా కనిపిస్తుంది కానీ అది పత్రికలతో తయారు చేసిందని తెలిస్తే ఎంతటి వారైనా నోరు తెరిచి ఆశ్చర్యపోతారు.
* ఎలిస్‌ స్టెన్‌మన్‌ అనే మెకానికల్‌ ఇంజినీర్‌ 1922లో ఈ ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. చెక్క ఫ్రేముల ఇంటి నమూనా వేసి, పాత పేపర్లని పొరలుపొరలుగా జిగురుతో అతికిస్తూ ఇంటి గోడల్ని కట్టాడు. చివర్లో వార్నిష్‌ అద్దుతూ గట్టి గోడల్లా తీర్చిదిద్దాడు.
* ఈ కాగితపు ఇంట్లో ప్రతిదీ పత్రికలతో తయారుచేసిందే. ఇందులో కనిపించే కుర్చీలు, టేబుళ్లు, పుస్తక అరలు ఇలా అన్నీ. వంట చేసే ప్రాంతంలో తప్ప. వీటన్నింటికీ లక్షకుపైగా వార్తాపత్రికల్ని ఉపయోగించాడట.
* రెండు సంవత్సరాల పాటు శ్రమించి ఈ వైవిధ్యమైన ఇల్లును నిర్మించుకున్నాడు.
* ఎలిస్‌ స్టెన్‌మన్‌ మరణించాక ప్రత్యేకమైన ఈ పేపర్‌ హౌస్‌ను 1942లో మ్యూజియంగా మార్చారు.
* అప్పటి నుంచి ఈ కాగితపు ఇంటిని చూడ్డానికి సందర్శకులు రావడం మొదలు పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని