అగ్నిజ్వాలల ఆలయం!

అనగనగా ఓ ఆలయం... అందులో ఎప్పుడూ మంటలు ఎగిసిపడుతూ కనిపిస్తాయి... ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ఏళ్ల నుంచి...ఆ అగ్నిజ్వాలలే ఆ గుడి అసలు ప్రత్యేకత!గుడిలో మనమైతే దీపం వెలిగిస్తాం. కానీ ఓ ఆలయంలో మాత్రం దీపం వెలిగించకుండానే మంటలు....

Updated : 12 Nov 2022 17:07 IST

అగ్నిజ్వాలల ఆలయం!

అనగనగా ఓ ఆలయం... అందులో ఎప్పుడూ మంటలు ఎగిసిపడుతూ కనిపిస్తాయి... ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ఏళ్ల నుంచి...ఆ అగ్నిజ్వాలలే ఆ గుడి అసలు ప్రత్యేకత!

గుడిలో మనమైతే దీపం వెలిగిస్తాం. కానీ ఓ ఆలయంలో మాత్రం దీపం వెలిగించకుండానే మంటలు ఎగసిపడుతుంటాయి. ఎక్కడో కాదు అటెస్‌గాహ్‌ అనే గుడిలో. చూడాలంటే అజర్‌బైజాన్‌ బాకులోని సురగ్జనికి వెళ్లాల్సిందే.
* మండపంలా ఉండే ఈ ఆలయ మధ్యంలో ఎప్పుడూ ఎగిసిపడుతున్న జ్వాలలు కనిపిస్తాయి. అయిదు త్రిభుజాకారాలతో ఉండే ఈ గుడి గుమ్మటాలపైనా ఆ మంటల వెలుగులుంటాయి. అందుకే దీన్ని ఫైర్‌ టెంపుల్‌ అని పిలుస్తారు. అటాష్‌ అంటే పర్షియన్‌ భాషలో మంట అని అర్థం.
* ఇక దీని చరిత్ర విషయానికి వస్తే... వందల ఏళ్ల క్రితం ఇక్కడ భూమి నుంచి మంటలు వస్తూ ఉండేవి. దీంతో స్థానికులంతా దేవుడి మాయగా భావించి ఇక్కడ పూజలు చేసుకునేవారు. తర్వాత 17, 18 శతాబ్దాల్లో ఇక్కడికి వచ్చిన హిందూ వ్యాపారులు ఇక్కడే గుడిని కట్టారు. దీంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందిట. జొరాస్ట్రియన్లు, హిందువులు దీన్ని పవిత్ర ప్రార్థనా స్థలంగా విశ్వసిస్తారు.
* ఈ గుడిలో మంటలకు అసలు కారణం ఏంటంటే... భూగర్భంలో ఉన్న సహజ వాయువులు. అవి బయటకు వచ్చి ఆక్సిజన్‌తో కలవడంతో మంటలు వచ్చేవి.
* కొన్నేళ్లకు లోపలున్న సహజవాయువులు తగ్గిపోవడంతో మంటలు అంతగా రాలేదట. దాంతో స్థానికులంతా దేవుడికి కోపం వచ్చిందని అనుకున్నారు.
* ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహజవాయువులు తగ్గిపోయినా పవిత్రతకు గుర్తుగా భావించే ఆ మంటల్ని కృత్రిమంగా ఏర్పాటు చేస్తూ మండిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని