కత్తుల శిల్సం.... కరుణకు రూపం!

రాతితో, చెక్కతో... మంచుతో, ఇసుకతో... మట్టితో చేసిన శిల్పాలు, విగ్రహాలు మనకు తెలుసు... మరి కత్తుల శిల్పం గురించి విన్నారా? అయితే వివరాలు చదివేయండి. ఏంజెల్‌... ఈ పేరు వినగానే మనకు తెల్లగా మెరిసిపోతూ కనిపించే దేవదూత రూపం కళ్ల ముందుకు వస్తుంది. కానీ ఓ దగ్గర ఏర్పాటు చేసిన ఏంజెల్‌ ఆకారం మాత్రం ఇందుకు భిన్నం.

Published : 27 Jan 2017 01:24 IST

కత్తుల శిల్సం.... కరుణకు రూపం!

రాతితో, చెక్కతో... మంచుతో, ఇసుకతో... మట్టితో చేసిన శిల్పాలు, విగ్రహాలు మనకు తెలుసు... మరి కత్తుల శిల్పం గురించి విన్నారా? అయితే వివరాలు చదివేయండి.
ఏంజెల్‌... ఈ పేరు వినగానే మనకు తెల్లగా మెరిసిపోతూ కనిపించే దేవదూత రూపం కళ్ల ముందుకు వస్తుంది. కానీ ఓ దగ్గర ఏర్పాటు చేసిన ఏంజెల్‌ ఆకారం మాత్రం ఇందుకు భిన్నం. ముఖం నిండా ఆశ్చర్యంతో చేతులు చాచి నలుపు రంగులో తెల్లని మెరుపులతో కనిపిస్తుంది. ఎందుకంటే వేలాది కత్తులతో ఈ ఆకారాన్ని తీర్చిదిద్దారు. అందుకే ఈ శిల్పానికి ‘నైఫ్‌ ఏంజెల్‌’ అని పేరు పెట్టారు.
* త్వరలో లండన్‌లోని ట్రఫల్‌గర్‌ స్క్వేర్‌లో ఉంచనున్న ఈ ఖడ్గశిల్పం 27 అడుగుల ఎత్తులో ఉంటుంది.
* కరకు కత్తులు కరుణామయ శిల్పంగా మారడమే దీని అసలు ప్రత్యేకత. దీన్ని రూపొందించడానికి ఏకంగా లక్ష కత్తులు వాడారు.
* దీన్ని అసలు ఎవరు? ఎందుకు చేశారు అంటే... ష్రోప్‌షైర్‌కు చెందిన బ్రిటిష్‌ ఐరన్‌వర్క్‌ సెంటర్‌ వాళ్లు తీర్చిదిద్దారు. విచక్షణ లేకుండా అమానుషంగా కత్తులతో జరిగే హత్యల్ని తగ్గించాలనీ, ప్రజల్లో చైతన్యం కల్పించాలనీ ముఖ్య ఉద్దేశంతో ఈ నైఫ్‌ ఏంజెల్‌ని రూపొందించారు.
* ఐరన్‌వర్క్‌ సెంటర్‌ చైర్మన్‌ క్లైవ్‌ నోల్స్‌ అనే ఆయన ఓసారి టీవీలో కత్తులతో జరిగే నేరాలు ఘోరాలపై వచ్చిన కథనం చూసి చలించిపోయారట. దీని కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘మీ కత్తులు అప్పగించండి... జీవితాన్ని కాపాడండి’ అనే నినాదంతో ప్రచారోద్యమం సాగిస్తున్నారు.
* మరి ఈ శిల్పం తయారీకి కత్తులు ఎలా వచ్చాయో తెలుసా? లొంగిపోయిన నేరగాళ్ల దగ్గర్నించి తీసుకున్న కత్తుల్ని 41 పోలీస్‌ రక్షణదళాలు విరాళంగా ఇచ్చాయిట.
* కరుణకు గుర్తుగా రెండు చేతులు చాచి కనిపించే ఈ శిల్పం తయారీకి రెండేళ్ల సమయం పట్టింది. ఇందులో ఉన్న కత్తుల్లో వాటి దాడివల్ల మరణించిన వారి పేర్లను కూడా చెక్కారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు