బుల్లి పుస్తకాలండీ! భూతద్దంతో చదవాలండీ!!

రకరకాల మ్యూజియాల గురించి వినుంటారు. మరి మినియేచర్‌ పుస్తకాలతో ఉన్న మ్యూజియం గురించి తెలుసా! జరీఫ్‌ సలహోవా అనే ఆవిడకు పుస్తకాలంటే తెగ ఇష్టం. ఆ ఆసక్తితో వైవిధ్యంగా అర చేతిలో దాచేంత పుస్తకాలను సేకరించింది. అలా ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల పాటు బుల్లి పుస్తకాల్ని సంపాదించి వాటితో మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. చూడాలంటే అజర్‌బైజాన్‌ దేశంలోని బాకుకు వెళ్లాల్సిందే.

Published : 07 Feb 2017 00:57 IST

బుల్లి పుస్తకాలండీ! భూతద్దంతో చదవాలండీ!!

చిన్నపుస్తకాలంటే అరచేతిలో ఇమిడేవి అని అనుకుంటాం... కానీ ఓ దగ్గర వేలెడంత బుల్లి పుస్తకాలున్నాయి... ప్రపంచంలోనే అతిచిన్న పుస్తకాలవి... ఇంతకీ ఎక్కడా? ఏమిటా వివరాలు?
కరకాల మ్యూజియాల గురించి వినుంటారు. మరి మినియేచర్‌ పుస్తకాలతో ఉన్న మ్యూజియం గురించి తెలుసా! జరీఫ్‌ సలహోవా అనే ఆవిడకు పుస్తకాలంటే తెగ ఇష్టం. ఆ ఆసక్తితో వైవిధ్యంగా అర చేతిలో దాచేంత పుస్తకాలను సేకరించింది. అలా ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల పాటు బుల్లి పుస్తకాల్ని సంపాదించి వాటితో మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. చూడాలంటే అజర్‌బైజాన్‌ దేశంలోని బాకుకు వెళ్లాల్సిందే.

* ఇందులో అడుగుపెట్టగానే బుల్లి బుల్లి వేలెడంత పుస్తకాలు కనిపిస్తాయి. అంతేకాదు... ప్రపంచంలోనే అతి సూక్ష్మమైన పుస్తకాలూ ఉంటాయిక్కడ. ఇవి కేవలం రెండు మిల్లీమీటర్ల పొడవుంటాయి. అంటే చిటికెన వేలి గోటిపై పట్టేంత చిన్నగా ఉంటాయన్నమాట. మరి వీటిలోని అక్షరాల్ని చదవడం ఎలా అనుకుంటారేమో? అందుకు భూతద్దం సాయం తప్పనిసరి.
* ప్రపంచం మొత్తంలో ఇలాంటి మినియేచర్‌ పుస్తకాల మ్యూజియం మరెక్కడా లేదు. ఈ మ్యూజియంలో మొత్తం 6,500 పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు.
* వీటిలో 64 దేశాలకు చెందిన వివిధ రకాల మినియేచర్‌ పుస్తకాలు కనిపిస్తాయి.
* ఈ మ్యూజియంలో ప్రముఖ రష్యన్‌ కవులు పుష్కిన్‌, దోస్తొయేవ్‌స్కీ, గొగోల్‌, చుకోవ్‌స్కీ రచనల బుల్లి పుస్తకాలూ ఉన్నాయి.
* ఈ పుస్తకాలన్నీ రష్యన్‌, అజెరి, ఇంగ్లిష్‌, జర్మన్‌ వంటి రకరకాల భాషలకు చెందినవి.
* పదిహేడో శతాబ్దానికి చెందిన పురాతనమైన మినియేచర్‌ ఖురాన్‌తో పాటు, 13వ శతాబ్దానికి చెందిన పుస్తకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
* అజర్‌బైజాన్‌ దేశ రాజ్యాంగాన్ని కూడా మినియేచర్‌ రూపంలో ఇక్కడ పొందుపరిచారు. అంతేకాదు దేశదేశాలకు చెందిన ప్రముఖుల పుస్తకాలూ ఉంటాయి.
* ఈ బుల్లి పుస్తకాల ప్రదర్శన శాలను 2002లో ప్రారంభించారు.
* ఈ సూక్ష్మ పుస్తకాల్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని