పగడాలదీవి ఇది...కడలిలో కలిసిపోతుందా!

కిరిబటి... పసిఫిక్‌ సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీప దేశం. 33 దీవులతో ఉండే ఈదేశంలో 21 దీవుల్లో మాత్రమే జనాలుంటారు. ఈ దేశం మన హైదరాబాద్‌ కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే. దేశం మొత్తంలో లక్ష మందికిపైగా ప్రజలుంటారంతే.

Published : 12 Feb 2017 01:37 IST

కిరిబటి
పగడాలదీవి ఇది...కడలిలో కలిసిపోతుందా!

* కిరిబటి... పసిఫిక్‌ సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీప దేశం.
* 33 దీవులతో ఉండే ఈదేశంలో 21 దీవుల్లో మాత్రమే జనాలుంటారు.
* ఈ దేశం మన హైదరాబాద్‌ కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే. దేశం మొత్తంలో లక్ష మందికిపైగా ప్రజలుంటారంతే.


 

* దేశం: కిరిబటి
* రాజధాని: తరవా
* జనాభా: 1,03,500
* విస్తీర్ణం: 811 చదరపు కిలోమీటర్లు
భాషలు: ఆంగ్లం, గిల్బర్టీస్‌
కరెన్సీ: ఆస్ట్రేలియన్‌ డాలర్‌



 



  * ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పగడపు దీవులతో (కోరల్‌రీఫ్స్‌) ఉన్న దేశం ఇదే. దేశంలో సగం పగడపు దీవులే ఉంటాయి.
* రాజధాని తరవా, గిల్బర్టే దీవుల్ని 1941లో మొదటిసారిగా జపనీయులు కనిపెట్టారు.
* జనాభా మొత్తంలో 90 శాతం మంది గిల్బర్టే ద్వీపంలో ఉంటారు.


 

* ఈ దేశంలో సముద్రమట్టానికి ఎక్కువ ఎత్తులో ఉన్న ఏకైక ద్వీపం బనబా. ఇది 266 అడుగుల ఎత్తులో ఉంటుంది.
* ఈ దేశంలోని దీవుల్లో చాలావరకు సముద్ర మట్టానికి మూడు నుంచి ఆరు అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 1999లో టెబువా తరవా, అబనువా అనే చిన్నద్వీపాలు మునిగిపోయాయి కూడా. మరో 50 ఏళ్లలో ఈ దేశం కూడా మునిగిపోతుందని అనుకుంటున్నారంతా. అందుకే ఈ దేశ ప్రజల్ని వేరే దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.


* ఇక్కడి క్రిస్మస్‌ దీవి వైశాల్య పరంగా ప్రపంచంలో అతి పెద్దది.
* ఈ దీవుల్లో క్రీస్తుపూర్వం 3000, క్రీస్తుశకం 1300 మధ్య కాలంలో మైక్రోనీషియన్స్‌ అనే జాతి వారుండేవారట.
* కిరిబటి ప్రముఖ వేడుక ఏటా మార్చినెలలో జరిగే యప్‌ డే ఫెస్టివల్‌.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని