పెళ్లాడాలంటే మూడేళ్లు శ్రమించాల్సిందే!

చాద్‌.. మధ్య ఆఫ్రికాలో ఉంది. ఈ దేశానికి సముద్ర తీరం లేదు. అన్ని పక్కలా ఇతర దేశాల భూభాగమే ఉంటుంది. ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్‌, దక్షిణాన సెంట్రల్‌ ఆఫ్రికా రిపబ్లిక్‌ ఉన్నాయి. అలాగే కామెరూన్‌, నైజర్‌ దేశాలూ ఈ దేశానికి సరిహద్దులు.

Published : 26 Feb 2017 01:33 IST

పెళ్లాడాలంటే మూడేళ్లు శ్రమించాల్సిందే!
చాద్‌

* చాద్‌.. మధ్య ఆఫ్రికాలో ఉంది. ఈ దేశానికి సముద్ర తీరం లేదు. అన్ని పక్కలా ఇతర దేశాల భూభాగమే ఉంటుంది. ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్‌, దక్షిణాన సెంట్రల్‌ ఆఫ్రికా రిపబ్లిక్‌ ఉన్నాయి. అలాగే కామెరూన్‌, నైజర్‌ దేశాలూ ఈ దేశానికి సరిహద్దులు.
* ఇక్కడి చాద్‌ అనే సరస్సు ఆఫ్రికాలోనే రెండో అతి పెద్దది. ప్రపంచంలో పదిహేడో అతి పెద్ద సరస్సు ఇది. దీని పేరు మీదుగానే ఈ దేశానికీ పేరొచ్చింది.


 

* దేశం: చాద్‌ రాజధాని: అన్‌జమేనా
* జనాభా: 1,36,70,084
* విస్తీర్ణం: 12,84,000 చదరపు కిలోమీటర్లు భాషలు: ఫ్రెంచ్‌, అరబిక్‌
* కరెన్సీ: మధ్య ఆఫ్రికా ఫ్రాంక్‌


 

* ఈ దేశంలో 100 భాషలు మాట్లాడతారు.
* ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి, అమ్మాయి వాళ్ల పొలంలో మూడు సంవత్సరాలు పని చేయాలి. అత్తింటివారి కోసం చిన్న గుడిసె, ఈత చాపలు తయారుచేయాలి.
* పిల్లలు పుట్టిన వెంటనే తల్లి వేరే ప్రదేశానికి వెళ్లకూడదు. అలా వెళితే దుష్టశక్తుల ప్రభావం పడుతుందని నమ్ముతారు.
* ఫ్రెంచ్‌ ఎక్కువ మాట్లాడే దేశాల్లో దీని స్థానం 21.
* ఇక్కడ సహజవనరులు ఎక్కువ. పెట్రోలియం, యురేనియం, బంగారం, సున్నపురాయి అధికంగా దొరుకుతాయి.
* ఈ దేశ జాతీయ మ్యూజియంలో 9వ శతాబ్దానికి చెందిన కళారూపాల్ని చూడొచ్చు.


 

* జెండా: నీలం రంగు ఆకాశానికీ, నమ్మకానికీ సూచిక. పసుపు రంగు సూర్యుడికి చిహ్నం. ఎరుపు అగ్నికీ, ఐకమత్యానికీ గుర్తు.


 

* ఈ దేశంలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి ప్రజలు నివసిస్తున్నారు. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దంలో బెర్బర్లు ఈ ప్రాంతానికి వలస వచ్చారు.
* ఈ దేశం ఫ్రెంచ్‌ కమ్యూనిటీలో స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్‌గా 1946లో అవతరించింది.
* 1960లో ఫ్రాన్స్‌ నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందింది.
* ఇక్కడి జకోమా నేషనల్‌ పార్కులో 226 జాతుల పక్షుల్ని గుర్తించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని