ఒక మనిషి... నాలుగు గొర్రెలు!

వేల్జ్‌.. ఈ దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో భాగం. గ్రేట్‌ బ్రిటన్‌కి చెందిన ద్వీపం. తూర్పున ఇంగ్లండ్‌, ఉత్తర, పడమర దిక్కుల్లో ఐరిష్‌ సముద్రం, దక్షిణాన బ్రిస్టల్‌ ఛానల్‌ ఉన్నాయి. ఈ దేశం అధిక భాగం కొండలు, పర్వతాలతో నిండి ఉంటుంది. ఇక్కడ మనుషులకంటే గొర్రెలు నాలుగు రెట్లు ఎక్కువ. ‘కమ్రి’ అని మరో పేరుతోనూ ఈ దేశాన్ని పిలుస్తారు.

Published : 05 Mar 2017 01:14 IST

ఒక మనిషి... నాలుగు గొర్రెలు!
వేల్జ్‌

* వేల్జ్‌.. ఈ దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో భాగం. గ్రేట్‌ బ్రిటన్‌కి చెందిన ద్వీపం. తూర్పున ఇంగ్లండ్‌, ఉత్తర, పడమర దిక్కుల్లో ఐరిష్‌ సముద్రం, దక్షిణాన బ్రిస్టల్‌ ఛానల్‌ ఉన్నాయి.
* ఈ దేశం అధిక భాగం కొండలు, పర్వతాలతో నిండి ఉంటుంది. ఇక్కడ మనుషులకంటే గొర్రెలు నాలుగు రెట్లు ఎక్కువ.
* ‘కమ్రి’ అని మరో పేరుతోనూ ఈ దేశాన్ని పిలుస్తారు.


* llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch

  ఈ దేశంలో ఓ చర్చి పేరు ఇది. ప్రపంచంలోనే పొడవైన పేరున్న స్థలమిది.


* ఘనమైన చరిత్ర, గొప్ప సంస్కృతులున్న దేశమిది. ఈ దేశంలో ఒక చదరపు మైలుకు ఉండే కోటల సంఖ్య ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికం.
* ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వతమైన ఎవరెస్ట్‌ పేరును ఈ దేశానికి చెందిన సర్‌ జార్జ్‌ ఎవరెస్ట్‌ పేరు మీదుగానే పెట్టారు.


దేశం: వేల్జ్‌
రాజధాని: కార్డిఫ్‌
జనాభా: 30,63,456
విస్తీర్ణం: 20,779 చదరపు కిలోమీటర్లు
భాషలు: వేల్ష్‌, ఆంగ్లం
కరెన్సీ: పౌండ్‌ స్టెర్లింగ్‌


జెండా: ఆకుపచ్చ తెలుపు నేపథ్యంలో ఉన్న ఎరుపు రంగు డ్రాగన్‌. దీని గురించి రకరకాల వివరణలున్నాయి. కానీ ప్రామాణికమైంది ఏదీ లేదు.


* రాజధానిలోని మిలీనియమ్‌ స్టేడియం పైకప్పు ముడుచుకోగలిగే నిర్మాణమున్న ప్రత్యేకత కలిగి ఉంది. ఈ తరహా స్టేడియాల్లో ప్రపంచంలోనే ఇది అతి పెద్దది.
* ఆంగ్ల భాషలోని అక్షరాలను పోలి ఉండే ఇక్కడి అధికారిక భాష అక్షరమాలలో K, Q, V, Z అక్షరాలు ఉండవు.
* ఈ ప్రాంతాన్ని కాల్పనిక గాథల్లోని ఆర్థర్‌ రాజు నేలగా చెబుతారు.
* ఇక్కడ కార్డిఫ్‌ కోట చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ జంతు వులవే.


* ఈ ప్రాంతానికి చెందిన రాబర్ట్‌ రికార్డే సమానార్థక గుర్తు ఈక్వల్‌టూ (=)ని కనిపెట్టారు.


* జనాభా మొత్తంలో వేల్ష్‌ భాష మాట్లాడేది కేవలం 21 శాతం మందే. ఎక్కువగా ఆంగ్ల భాషే మాట్లాడుతారు.

* బ్రిటన్‌కి చెందిన రాజకుటుంబీకులు వెడ్డింగ్‌ రింగ్స్‌ కోసం ఈ దేశ బంగారాన్నే ఉపయోగిస్తారు.

* రగ్బీ ఈ దేశ జాతీయ క్రీడ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని