భలే భలే... ఊ­గే కోస్టర్‌!

ఒక్కసారిగా పైకి తీసుకెళ్తుతుంది... అంతేనా?రయ్యిమంటూ పరుగులు పెడుతుంది... అంతేనా?హఠాత్తుగా వంకర్లు తిరిగిపోతూ ఊయలలా ఊపేస్తుంది... ఇదంతా ఓ ఊగే కోస్టర్‌ సంగతులు! రోలర్‌ కోస్టర్‌ అనగానే పట్టాలపై ఉండే కార్లలో కూర్చుని దూసుకుపోవడమే

Published : 11 Mar 2017 01:11 IST

భలే భలే... ఊ­గే కోస్టర్‌!

ఒక్కసారిగా పైకి తీసుకెళ్తుతుంది... అంతేనా?రయ్యిమంటూ పరుగులు పెడుతుంది... అంతేనా?హఠాత్తుగా వంకర్లు తిరిగిపోతూ ఊయలలా ఊపేస్తుంది... ఇదంతా ఓ ఊగే కోస్టర్‌ సంగతులు!
రోలర్‌ కోస్టర్‌ అనగానే పట్టాలపై ఉండే కార్లలో కూర్చుని దూసుకుపోవడమే అనుకుంటాం. కానీ కెనడా వండర్‌ల్యాండ్‌లోని వోర్‌టెక్స్‌ అనే ఓ రోలర్‌కోస్టర్‌ ఇందుకు భిన్నం. మిగతా రైడ్లకన్నా భలే గమ్మత్తుగా ఉంటుంది.
* రయ్యిరయ్యిమని పరుగులు పెడుతూ జర్రుజర్రున జారిపోవడమే కాదు... అటూ ఇటూ ఊయల్లా ఊగేస్తుందిది. గంటకు ఏకంగా 89 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అందుకే దీనికి ప్రపంచంలోనే వేగవంతమైన ఊగే రోలర్‌కోస్టర్‌గా పేరు. ఎత్తయిన ఊగే రోలర్‌కోస్టర్‌గా గిన్నిస్‌ రికార్డూ ఉంది.
* ఇందులో కూర్చోగానే క్షణాల్లో ముందుకు వెళుతూ పైకీ కిందికీ ప్రయాణిస్తుంది. పార్కులో ఉన్న కొండాకోనల దగ్గర్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న కొలనులను దాటుతూ వెళుతుంది. అటూ ఇటూ ఊగుతూ కొన్ని చోట్లయితే పట్టాలపై ఉండే కార్లన్నీ పక్కకు వంగిపోతూ ఆ కొలను నీటిలో పడిపోతున్న వింత అనుభూతి కల్గిస్తుందీ కోస్టర్‌.
* మొత్తం 2,361 అడుగుల పొడవైన ఈ రోలర్‌ కోస్టర్‌ మెరుపు వేగంతో ఒకటిన్నర నిమిషాల్లో రైడు పూర్తిచేస్తుంది.
* ఎత్తుపల్లాలతో పాటు ఊగుతూ దూసుకుపోయే ఈ రోలర్‌ కోస్టర్లో ఎక్కాలంటే ఎంతో గుండెధైర్యం ఉండాలి మరి. ఈ రైడులో ఒకేసారి 24 మంది సరిపోతారు.
* 1991లో ప్రారంభమైన ఈ వింత కోస్టర్‌ ఎక్కి తమ సరదా తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు