ఐస్‌క్రీం పుట్టింది ఇక్కడేనట! మంగోలియా

మంగోలియా... తూర్పు ఆసియాలో ఉంది. ఈ దేశ సరిహద్దుల్లో సముద్రతీరం లేదు. అన్ని వైపులా భూభాగాన్ని కలిగి ఉంటుంది. దక్షిణాన చైనా, ఉత్తరాన రష్యా దేశాలు ఈ దేశానికి సరిహద్దులు. అన్నివైపులా భూభాగమే కలిగిన దేశాల్లో ఇది రెండో అతిపెద్ద దేశం.

Published : 12 Mar 2017 01:20 IST

ఐస్‌క్రీం పుట్టింది ఇక్కడేనట!
మంగోలియా

* మంగోలియా... తూర్పు ఆసియాలో ఉంది. ఈ దేశ సరిహద్దుల్లో సముద్రతీరం లేదు. అన్ని వైపులా భూభాగాన్ని కలిగి ఉంటుంది. దక్షిణాన చైనా, ఉత్తరాన రష్యా దేశాలు ఈ దేశానికి సరిహద్దులు.
* అన్నివైపులా భూభాగమే కలిగిన దేశాల్లో ఇది రెండో అతిపెద్ద దేశం.
జెండా: నీలం రంగు ఆకాశానికి గుర్తు. ఎరుపు రంగు కఠిన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొనే మంగోలియన్ల అభివృద్ధికి సూచిక.
* ఇక్కడ ఏడాదిలో 250 రోజులు సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటాడు. అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్‌ బ్లూ స్కై, ల్యాండ్‌ ఆఫ్‌ ది ఎటెర్నల్‌ బ్లూ స్కై అని పిలుస్తుంటారు.


* ఈ దేశ జనాభా చాలా తక్కువ. జన సాంద్రత ఒక చదరపు మైలుకు కేవలం నలుగురు మాత్రమే. దేశ జనాభాలో 45 శాతం రాజధాని ఉలాన్‌బాటర్‌లోనే నివసిస్తున్నారు.
* ఈ దేశంలో దాదాపు 30 శాతం జనాభా సంచార జాతులే. ప్రపంచంలో సంచార జాతులు ఇంకా మిగిలి ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి.


* ఓ సిద్ధాంతం ప్రకారం మనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీం మొదటిసారిగా తయారైంది ఈ దేశంలోనే. మంగోలియాకు చెందిన ఓ గుర్రపు రౌతు ఓసారి జంతువుల పేగులతో తయారుచేసిన పాత్రల్లో క్రీం వేసుకుని గోబీ ఎడారి గుండా ప్రయాణం మొదలుపెట్టాడట. గుర్రం పరుగులకు ఆ క్రీం అటూ ఇటూ కదులుతూ శీతల వాతావరణంలో పూర్తిగా గడ్డకట్టిపోయింది. అలా అనుకోకుండా ఐస్‌క్రీం తయారైంది. ఆ పద్ధతే దేశదేశాల్లోకి పాకిపోయిందిట.


* రెండు మూపురాలుండే అరుదైన ఒంటెలు ఈ దేశంలో ఉంటాయి.


దేశం:మంగోలియా
రాజధాని:ఉలాన్‌ బాటర్‌
జనాభా: 30,81,677
విస్తీర్ణం:15,66,000 చదరపు కిలోమీటర్లు
భాష: మంగోలియన్‌
కరెన్సీ: టోగ్రోగ్‌


* ఇక్కడ నివసించే మనుషుల కన్నా గుర్రాల సంఖ్య 13 రెట్లు ఎక్కువ. గొర్రెలేమో ఒక మనిషికి 35 చొప్పున ఉంటాయి.

* ఆసియాలోనే అతి పెద్దది, ప్రపంచ ఎడారుల్లో ఐదో స్థానంలోది అయిన గోబీ ఎడారి ఉండేది ఈ దేశంలోనే.
* ఇక్కడ టీ లేదా పాలతో తయారుచేసిన ఆహార పదార్థాల్ని ఇస్తే నిరాకరించడం
అగౌరవంగా భావిస్తారు.


* ప్రపంచంలోనే పురాతనమైన జాతీయ పార్కు మంగోలియాలోనే ఉంది.
* డైనోసార్‌ గుడ్లను మొదటిసారి కనిపెట్టిన రాయ్‌ చాప్‌మన్‌ ఆండ్రూస్‌ అనే వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే.
* చైనా గోడను ఆరో శతాబ్దంలో ఇన్నర్‌ మంగోలియాలోనే నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని