జర్రున జారి... వెనక్కి వెనక్కి!

కొన్ని సినిమాల్లో చూసుంటారు. ఈల వేయగానే ముందుకు వెళ్లే కారు కాస్తా వెనక్కి రావడం లాంటివి. అదంతా నిజం కాదని తెలిసినా భలే సరదాగా అనిపిస్తుంది. కానీ నిజంగా అలాంటి అనుభూతిని మనం పొందొచ్చు. పైగా ఏ ఈల కూడా అక్కర్లేదు. అక్కడికి కారు తీసుకుని వెళితే చాలు.

Published : 12 Apr 2017 01:26 IST

జర్రున జారి... వెనక్కి వెనక్కి!

కొన్ని సినిమాల్లో చూసుంటారు. ఈల వేయగానే ముందుకు వెళ్లే కారు కాస్తా వెనక్కి రావడం లాంటివి. అదంతా నిజం కాదని తెలిసినా భలే సరదాగా అనిపిస్తుంది. కానీ నిజంగా అలాంటి అనుభూతిని మనం పొందొచ్చు. పైగా ఏ ఈల కూడా అక్కర్లేదు. అక్కడికి కారు తీసుకుని వెళితే చాలు.
* ఇంతకీ ఎక్కడబ్బా? కెనడాలోని న్యూ బ్రున్స్‌విక్‌లో ఉన్న ‘మోనోక్టాన్‌ హిల్‌’ దగ్గర.
* ఇదో వింత కొండ. ప్రకృతి వింతున్న ఈ ప్రదేశాన్నే ‘మాగ్నటిక్‌ హిల్‌’ అని కూడా పిలుస్తారు.
* గత 80 ఏళ్లుగా ఈ కొండని చూడ్డానికి లక్షలాది పర్యటకులు వస్తూనే ఉన్నారు. అంత ప్రత్యేకత ఏంటంటే... ఈ చిన్న కొండ మీద నుంచి కిందకు దిగుతూ దిగువకు వచ్చినపుడు బ్రేక్‌ మీద నుంచి కాలు తీయగానే కారు కిందకు కాకుండా గమ్మత్తుగా కొండపైకి కొంతదూరం వెనక్కి వెళుతుందిట. యాక్సిలరేటర్‌ నొక్కతేగానీ ముందుకు వెళ్లలేదు.
* ఈ వింత చోట గురుత్వాకర్షణ శక్తి పనిచేయకపోవడం వల్లే ఇలా జరగొచ్చని అనుకుంటారంతా.
* 19వ శతాబ్దంలో ఈ కొండపై నుంచి బండి వెళ్లేంత దారి ఉండేదిట. ఓసారి ఈ దారి గుండా వెళుతున్న డ్రైవర్లు కొండ దిగువ భాగాన కారు ముందుకు కాకుండా వెనక్కి వెళ్లడం గమనించారు. అలా అలా.... ఈ అయస్కాంత కొండ ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిపోయిందిట. నెమ్మదిగా ప్రపంచమంతా పాకిపోయింది.
* ఇప్పుడిక్కడికి సందర్శకులంతా కార్లు వేసుకుని వస్తుంటారు. వెనక్కి తిరిగి కూర్చుని సరదా తీర్చుకుంటారు. ఈ ముచ్చట తీర్చుకోవడం ఉచితమేమీ కాదు. కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది సుమా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు