తరగని వింతల థాయ్!

ఎరుపు రంగు... జీవనాధారమైన రక్తానికి, తెలుపు బౌద్ధమత స్వచ్ఛతకు, నీలం రంగు రాచరికానికి గుర్తులు. ఇక్కడ మడ్‌స్కిప్పర్‌ అనే ప్రత్యేకమైన చేప ఒకటుంది. ఇది నేలపై నడవగలదు, చెట్లు ఎక్కగలదు.పర్యటకులు అత్యధికంగా సందర్శించే దేశం ఇది. ఏటా ఈ దేశాన్ని అరవైలక్షల...

Published : 16 Apr 2017 01:26 IST

తరగని వింతల థాయ్‌!
థాయ్‌లాండ్‌

జెండా: ఎరుపు రంగు... జీవనాధారమైన రక్తానికి, తెలుపు బౌద్ధమత స్వచ్ఛతకు, నీలం రంగు రాచరికానికి గుర్తులు.


దేశం: థాయ్‌లాండ్‌
రాజధాని: బ్యాంకాక్‌
జనాభా: 6,79,59,000
విస్తీర్ణం: 5,13,120 చదరపు కిలోమీటర్లు
భాష: థాయ్‌
కరెన్సీ: బాత్‌


* ఇక్కడ మడ్‌స్కిప్పర్‌ అనే ప్రత్యేకమైన చేప ఒకటుంది. ఇది నేలపై నడవగలదు, చెట్లు ఎక్కగలదు.


* పర్యటకులు అత్యధికంగా సందర్శించే దేశం ఇది. ఏటా ఈ దేశాన్ని అరవైలక్షల మంది సందర్శిస్తారు.
* థాయ్‌లాండ్‌... ఇండోచైనీస్‌ ద్వీపకల్పం మధ్యలో ఉంటుంది. దీన్నే ‘సియాం’ అని పిలుస్తారు.
* ఉత్తరాన మయన్మార్‌, లావోస్‌, తూర్పున లావోస్‌, కాంబోడియా, దక్షిణాన గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌, మలేసియా, పశ్చిమాన అండమాన్‌ సముద్రం సరిహద్దులు.
* థాయ్‌లాండ్‌ అంటే ‘ల్యాండ్‌ ఆఫ్‌ ది ఫ్రీ’ అని అర్థం. ఆగ్నేయ ఆసియాలో యూరోపియన్ల అధీనంలోకి రానిది ఇదొక్కటే.
* రాజధాని బ్యాంకాక్‌లో పెద్ద సంఖ్యలో కాలువలు దర్శన మిస్తాయి. అందుకే దీన్ని ‘వెనిస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని పిలుస్తారు.
* అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో ఇదీ ఒకటి.
* ఈ దేశంలో బౌద్ధమతస్థులు ఎక్కువ. దేశంలో ఎక్కడ చూసినా బోలెడు బుద్ధుని గుళ్లు, విగ్రహాలు కనిపిస్తుంటాయి.


* ప్రపంచంలోనే అతి పెద్దవి ఇక్కడ చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు బుద్ధవిగ్రహం, అతి పెద్ద మొసళ్ల కేంద్రం, అతి పెద్ద రెస్టారెంటు, పొడవైన సింగిల్‌ స్పాన్‌ వూగే వంతెన, ఎత్తయిన హోటల్‌ ఇవన్నీ.


* అప్పట్లో రాజులతో సహా 20 ఏళ్లు వచ్చేలోపే యువత బౌద్ధ సన్యాసులుగా మారేవారు.
* శతాబ్దం క్రితం ఇక్కడ లక్షకుపైగా ఏనుగులు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. కేవలం ఐదువేల ఏనుగులే మిగిలాయి.


* 15 వేల ఆర్కిడ్‌ పూల జాతులకు ఇది నిలయం.


* థాయ్‌ అక్షరమాలలో 32 అచ్చులు, 44 హల్లులు ఉంటాయి.
* నేలపై ఉన్న జీవులన్నింటిలో పదో వంతు ఇక్కడే కనిపిస్తుంటాయి.
* ప్రపంచంలోనే పొడవాటి ప్రమాదకరమైన విషసర్పం ‘కింగ్‌ కోబ్రా’ ఎక్కువగా కనిపించేది ఇక్కడే. దీని పొడవు ఏకంగా 18 అడుగులు. దీని విష ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే... ఒక్కకాటుకే పేద్ద ఏనుగు సైతం చనిపోతుంది.


* ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం బంబుల్‌ గబ్బిలం ఇక్కడే ఉంటుంది.
* బ్యాంకాక్‌ పూర్తి పేరు Krungthepmahanakhon Amonrattanakosin Mahintharayutthaya Mahadilokphop Noppharatratchathaniburirom Udomratchaniwetmaha sathan Amonphimanawatan sathit Sakkathattiyawitsanukamprasit. దీనర్థం.."City of Angels, Great City of Immortals, Magnificent City of the Nine Gems, Seat of the King, City of Royal Palaces, Home of Gods Incarnate, Erected by Visvakarman at Indra's Behest.
* చొక్కా లేకుండా వాహనం నడపటం ఈ దేశంలో నేరం.
* థాయ్‌ కరెన్సీపై కాలుపెట్టడం తప్పుగా భావిస్తారు. ఇది శిక్షార్హం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని