ఈ వేర్ల మ్యూజియమే వేరయా!

ఆకట్టుకునే జీవులు... అలరించే అలంకరణ వస్తువులు... కనువిందు చేసే ఆకారాలు... ఓ మ్యూజియంలో నిండి ఉన్నాయి... ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటంటే... అవన్నీ రూపొందింది చెట్ల వేర్లతో! మీరు గమనించారో లేదో ఒక్కోసారి వంకర్లు తిరిగిన చెట్ల వేర్లను చూస్తే ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆ రూపాలే ఏ పిట్టలానో, పిల్లిలానో లేదా ఇంట్లో ఉండే వస్తువుల్లానో వంపులు తిరిగి ఉంటాయి. అలా ఓ మామయ్యకూ కనిపించాయి. కానీ ఆ మామయ్య అలాంటి వాటిని చూసి వదిలేయలేదు.

Published : 19 Apr 2017 01:41 IST

ఈ వేర్ల మ్యూజియమే వేరయా!

ఆకట్టుకునే జీవులు... అలరించే అలంకరణ వస్తువులు... కనువిందు చేసే ఆకారాలు... ఓ మ్యూజియంలో నిండి ఉన్నాయి... ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటంటే... అవన్నీ రూపొందింది చెట్ల వేర్లతో!

మీరు గమనించారో లేదో ఒక్కోసారి వంకర్లు తిరిగిన చెట్ల వేర్లను చూస్తే ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆ రూపాలే ఏ పిట్టలానో, పిల్లిలానో లేదా ఇంట్లో ఉండే వస్తువుల్లానో వంపులు తిరిగి ఉంటాయి. అలా ఓ మామయ్యకూ కనిపించాయి. కానీ ఆ మామయ్య అలాంటి వాటిని చూసి వదిలేయలేదు. భలేగా ఉన్నాయబ్బా అనుకుని కొన్ని కొన్ని మార్పులు చేస్తూ కళాఖండాలుగా మలిచాడు. వాటన్నింటితో ఏకంగా ప్రదర్శనశాలనే ఏర్పాటు చేశాడు.

* ‘మిలియన్‌ అండ్‌ వన్‌ రూట్స్‌’గా పిలిచే ఈ మ్యూజియాన్ని చూడాలంటే ఫ్రాన్స్‌లోని కార్నిమౌంట్‌కి వెళ్లాల్సిందే.

*గోడలు, నేల, పైకప్పు ఇలా ఎక్కడ చూసినా చిత్రమైన ఆకారాల్లో ఉన్న వేర్లే దర్శనమిస్తాయి. అంతేనా? వేర్లతో చేసిన గడియారం, దీపాలు, జీవులు, ఆకట్టుకునే బల్లలు, అద్భుతమైన అలంకరణ వస్తువులతో నిండి ఉంటుందా ప్రదర్శనశాల.

*వేర్లన్నీ ఇలా ఎలా అయ్యాయబ్బా అనిపిస్తుంది చూస్తుంటే... దీనికి కారణం మిచెల్‌ మారిస్‌ అనే మామయ్య. ఓసారి ఆక్టోపస్‌లా కనిపించిన ఓ వేరును చూసి కొన్ని మార్పులు చేసి పూర్తి రూపం తెచ్చాడట. తనకెంతో నచ్చి అప్పట్నించి అడవుల్లో పడిపోయున్న వేర్లను సేకరించడం మొదలుపెట్టాడు. వాటిని తెచ్చి చిన్ని చిన్ని మార్పులు చేస్తూ బోలెడు కళాఖండాల్ని చేసిపెట్టాడు. ఎన్నో ఏళ్లు శ్రమించి ఇప్పటి వరకు మొత్తం 8వందల వేర్ల రూపాల్ని తీర్చిదిద్దాడు.

*ఈ మ్యూజియంలోనే కీటకాల ప్రతిరూపాలతో పాటు కలపకొచ్చే చెదల వివరాలూ ఉంచారు.

*వీటిని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని