నరకపు లోయలో... జలకాలాటలలో..!

పార్కంటే అందమైన పూల మొక్కలు, పచ్చిక మైదానాలు, చిన్న పిల్లల ఆటవస్తువులు... ఇవే కదా ఉంటాయి. కానీ ఓ పార్కులో అడుగుపెడితే మాత్రం భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఆ పార్కు పేరు వింటేనే దడ పుడుతుంది. దాని పేరు జిగోకుడని...

Published : 21 Apr 2017 01:48 IST

నరకపు లోయలో... జలకాలాటలలో..!

పార్కంటే అందమైన పూల మొక్కలు, పచ్చిక మైదానాలు, చిన్న పిల్లల ఆటవస్తువులు... ఇవే కదా ఉంటాయి. కానీ ఓ పార్కులో అడుగుపెడితే మాత్రం భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఆ పార్కు పేరు వింటేనే దడ పుడుతుంది. దాని పేరు జిగోకుడని... అంటే నరకపు లోయ అని అర్థం. వినడానికే విచిత్రంగా ఉన్న ఆ పార్కు విశేషాలివిగో.

పాన్‌లోని నొబొరిబెత్సు అనే పట్టణంలో ఉందా పార్కు. 24 ఎకరాల విస్తీర్ణంలో కొండ ప్రాంతంలో ఉండే ఈ పార్కులో ఏ లోయ చూసినా పెద్ద ఎత్తున పొగలు కక్కుతూ భయంకరంగా ఉంటుంది. అక్కడి సరస్సుల్లో నీరు ఎప్పుడూ సలసల కాగిపోతూ ఆవిర్లు వస్తుంటాయి. చెరువులు బురద నీటితో నిండి ఉంటాయి. అక్కడ చిత్రవిచిత్రమైన ఆకారాల్లో ఉండే రాక్షసుల బొమ్మలు భయపెట్టేలా ఉంటాయి. వీటివెనుక ఆసక్తికరమైన విషయాలున్నాయి

* 20 వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అగ్నిపర్వత విస్ఫోటం జరిగిందట. అప్పట్నుంచీ భూగర్భ ఉష్ణోగ్రతలు పెరగడంతో నేలపైన పొగలు రావడం మొదలైంది. ఈ ఉష్ణోగ్రత కారణంగానే సరస్సుల్లో నీరు కూడా వేడిగా ఉంటుంది.

* ఈ సరస్సుల్లోని నీటిలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని, ఆ నీటితో స్నానం చేస్తే జబ్బులు నయమవుతాయని అక్కడివారి నమ్మకం. అక్కడున్న రిసార్టులు, స్పాల్లో ఈ నీటితో ప్రత్యేక స్నానాలు చేసే ఏర్పాటు చేశారు. ఇక్కడ జలకాలాడటానికే చాలా మంది పర్యటకులు వస్తుంటారు.

* పందొమ్మిదో శతాబ్దంలో రష్యా, జపాన్‌ యుద్ధంలో గాయపడిన సైనికులకు ఈ స్పాల్లో స్నానం చేయిస్తూ చికిత్స చేస్తే కోలుకున్నారట.

* ఇక్కడ నరకానికి అధిపతిగా భావించే ఎన్మా అనే రాక్షస దేవుడి బొమ్మలతో పాటు యుకిజిన్‌ అనే రాక్షసుల బొమ్మలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. వీరు పర్యటకులను నరక లోయకు స్వాగతం పలుకుతుంటారని, ప్రజలకు రక్షణగా ఉంటారని అక్కడి వారి విశ్వాసం.

* ప్రతి ఆగస్టులో నరకపు పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారు. ఆరోజు భారీగా పటాసులు పేలుస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని