రావణ రాజ్యమట... సముద్రపు ముత్యమట!

శ్రీలంక... మన దేశానికి పొరుగు దేశం. దక్షిణ ఆసియాలో ఉండే ఈ దేశాన్ని హిందూ మహా సముద్రపు ముత్యంగా పిలుస్తారు. దీని ఆకారం ఆధారంగా భారత దేశపు కన్నీటి చుక్కగా మరో పేరూ ఉంది దీనికి. ప్రపంచంలో అందమైన ద్వీపాల్లో ఈ దేశమొకటి. ఈ దేశానికి మూడు వేల ఏళ్ల నాటి గొప్ప చరిత్రుంది. సంస్కృతంలో ఈ దేశం పేరుకు అర్థం ఆకర్షణీయమైన ద్వీపం అని.

Published : 30 Apr 2017 01:51 IST

రావణ రాజ్యమట... సముద్రపు ముత్యమట!
శ్రీలంక

* శ్రీలంక... మన దేశానికి పొరుగు దేశం. దక్షిణ ఆసియాలో ఉండే ఈ దేశాన్ని హిందూ మహా సముద్రపు ముత్యంగా పిలుస్తారు.
* దీని ఆకారం ఆధారంగా భారత దేశపు కన్నీటి చుక్కగా మరో పేరూ ఉంది దీనికి.
* ప్రపంచంలో అందమైన ద్వీపాల్లో ఈ దేశమొకటి.
* ఈ దేశానికి మూడు వేల ఏళ్ల నాటి గొప్ప చరిత్రుంది. సంస్కృతంలో ఈ దేశం పేరుకు అర్థం ఆకర్షణీయమైన ద్వీపం అని.


దేశం: శ్రీలంక
రాజధాని: కొలంబో
జనాభా: 2,02,77,597
విస్తీర్ణం: 65,610 చదరపు కిలోమీటర్లు
భాషలు: సింహళీస్‌, తమిళం
కరెన్సీ: శ్రీలంక రూపాయి


జెండా: ప్రపంచంలోని ప్రాచీన జెండాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి అన్ని రకాల సంస్కృతులకు, జాతులకు సూచిక. సింహం సింహళీయులకు, నాలుగు ఆకులు నలుమూలలా ఉన్న బౌద్ధుల నమ్మకానికి, కాషాయం, ఆకుపచ్చ హిందూ, ముస్లిం మతాలకు చిహ్నాలు.


* రామాయణ గాథలో ఈ దేశాన్ని పేర్కొన్నారు. రావణుడి రాజ్యం లంక ఇదేనని నమ్మకం.
* ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని ఈ దేశానికి చెందినవారే. పేరు సిరిమావో బండారు నాయకే.


* ఈ దేశం 1948లో బ్రిటన్‌ దగ్గర్నించి స్వాతంత్య్రం పొందింది.
* 1972 వరకు ఈ దేశాన్నే ‘సిలోన్‌’ అని పిలిచేవారు.
* ఈ దేశంలో జలపాతాలు ఎక్కువ. నదులు వందకుపైగా ఉంటాయి. అధికంగా జల విద్యుత్తుపైనే ఆధారపడి ఉంటుందీ దేశం.
* ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మాదక ద్రవ్యాల రవాణాతో పట్టుబడితే మరణ శిక్ష విధిస్తారట.


* మానవులు నాటిన అతి ప్రాచీన వృక్షం ఉందిక్కడ. ఈ వృక్షం పేరు శ్రీ మహా బోధియా.
* దక్షిణ ఆసియా మొత్తంలో అక్షరాస్యత ఎక్కువున్న దేశం ఇదే. దీని శాతం 92.
* ఇక్కడి ఆడమ్‌ పర్వత శిఖరాన్ని పవిత్ర స్థలంగా చెబుతారు. ఇక్కడ బుద్ధుడి అడుగులున్నట్టు నమ్ముతారు.
* ఎక్కువగా తేయాకు ఎగుమతి చేసే దేశాల్లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న సిలోన్‌ టీ ఇక్కడే తయారవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని