హలో కిట్టీ... రికార్డు కొట్టీ!

ముద్దుగా ఉండే హలో కిట్టీ బొమ్మలంటే ఎవ్వరికైనా ఇష్టమే. జపాన్‌లో ఉన్న ఓ మామయ్యకైతే మరీనూ! ఎంతంటే రికార్డు కొట్టేంత! ఈ మామయ్య పేరు మసోవా గుంజి. ఉండేది జపాన్‌లోని ఛిబాలో. కిట్టీలపై ఉండే ఇష్టంతో 30 ఏళ్లుగా ఆ బొమ్మలు ఎక్కడ కనిపించినా కొనేస్తున్నాడు.....

Published : 15 May 2017 01:39 IST

హలో కిట్టీ... రికార్డు కొట్టీ!


ముద్దుగా ఉండే హలో కిట్టీ బొమ్మలంటే ఎవ్వరికైనా ఇష్టమే. జపాన్‌లో ఉన్న ఓ మామయ్యకైతే మరీనూ! ఎంతంటే రికార్డు కొట్టేంత!

* ఈ మామయ్య పేరు మసోవా గుంజి. ఉండేది జపాన్‌లోని ఛిబాలో. కిట్టీలపై ఉండే ఇష్టంతో 30 ఏళ్లుగా ఆ బొమ్మలు ఎక్కడ కనిపించినా కొనేస్తున్నాడు.

* బయటి నుంచి వాళ్లిల్లు చూస్తేనే కిట్టీ ఇల్లులా ముచ్చటగా ఉంటుంది. తలుపు తెరవగానే ఏదో బొమ్మల లోకం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.

* చుట్టూ ఉండే గోడలు, అరలు, తలుపులు, నేలపై ఎటు చూసినా ఈ బొమ్మలు, వీటి ప్రతిరూపాలే.

* టీ కప్పుల దగ్గర నుంచి హెల్మెట్లు, ఫ్రిజ్‌లు, ఒవెన్‌లు, మిక్సీలు, కీచైన్‌లు, బీరువాలు, కుర్చీలు, కార్పెట్లు... ఇలా రకరకాల కిట్టీ రూపాలు ఈ ఇంట్లో కొలువుదీరాయి.

* ఈ బొమ్మలన్నీ లెక్క పెడితే ఏకంగా 5169 అయ్యాయి. ఎక్కువ హలో కిట్టీల సేకరణ అంటూ గిన్నిస్‌ బుక్‌ వారు మామయ్యకు రికార్డూ కట్టబెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు