బాహుబలి.. ఆట భళీ!

మాహిష్మతి రాజ్యానికి ఒక్కసారిగా మనం సేనాని అయిపోవచ్చు. సైనికులకు మంచి శిక్షణనిచ్చి శత్రు సైనికుల్ని అంతమొందించొచ్చు. కాలకేయుడికి ఎదురొడ్డి నిలబడొచ్చు. యుద్ధంలో గెలిచి మన రాజు బాహుబలి మన్ననలు పొందవచ్చు....

Published : 17 May 2017 00:42 IST

బాహుబలి.. ఆట భళీ!

మాహిష్మతి రాజ్యానికి ఒక్కసారిగా మనం సేనాని అయిపోవచ్చు. సైనికులకు మంచి శిక్షణనిచ్చి శత్రు సైనికుల్ని అంతమొందించొచ్చు. కాలకేయుడికి ఎదురొడ్డి నిలబడొచ్చు. యుద్ధంలో గెలిచి మన రాజు బాహుబలి మన్ననలు పొందవచ్చు. గెలిచే కొద్దీ బోలెడు పాయింట్లు. పాయింట్లు వచ్చే కొద్దీ బోలెడు నిధులు, ఆయుధాలు, ఆహారం... ఇలాంటివన్నీ మన సొంతం. వాటిని మళ్లీ యుద్ధం చేసినప్పుడు ఉపయోగించొచ్చు. ఇవన్నీ ‘బాహుబలి ది గేమ్‌’ సంగతులు.
* మన దేశంలో ఇప్పుడు ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న తొలి పది ఆటల్లో ఇది కూడా ఒకటి.
* హిందీ, తెలుగు, తమిళ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉన్న దీన్ని ఇప్పటికే 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
* అర్కా మీడియా వర్క్స్‌, గ్రాఫిక్స్‌ ఇండియా, మూన్‌ఫ్రాగ్‌ సంస్థలు దీన్ని రూపొందించాయి. మరింకెందుకు ఆలస్యం పదండి.. మనమూ కాలకేయుడితో యుద్ధం చేసేద్దాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని