భారీ శిల్పం... భలే సింహం!

హాయ్‌ మిత్రులారా! నేనే చిన్నూని. సెలవుల్లో ఈ మధ్య చైనాలోని ఉహాన్‌ అనే చోటికెళ్లొచ్చా. అక్కడ నడివీధిలో గర్జిస్తున్నట్లు నోరు తెరుచుకుని, కండలు తిరిగిన పేద్ద సింహం బొమ్మ కనిపించింది. ఇల్లంత ఉన్న దాన్ని అదాటున చూసేసరికి భయంతో ఉలిక్కిపడ్డా.

Published : 22 May 2017 01:36 IST

భారీ శిల్పం... భలే సింహం!
చిన్నూ కబుర్లు

హాయ్‌ మిత్రులారా! నేనే చిన్నూని. సెలవుల్లో ఈ మధ్య చైనాలోని ఉహాన్‌ అనే చోటికెళ్లొచ్చా. అక్కడ నడివీధిలో గర్జిస్తున్నట్లు నోరు తెరుచుకుని, కండలు తిరిగిన పేద్ద సింహం బొమ్మ కనిపించింది. ఇల్లంత ఉన్న దాన్ని అదాటున చూసేసరికి భయంతో ఉలిక్కిపడ్డా. తర్వాత దాని సంగతులు తెలుసుకుని ఆశ్చర్యపోయా. గమ్మత్తుగా ఉన్న ఆ వివరాలన్నీ మీకు చెబుదామని తెలుసుకొచ్చా.
* ఇది ఒకే రెడ్‌వుడ్‌ దుంగతో చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క సింహమట.
* ఓ పేద్ద రెడ్‌వుడ్‌ చెట్టుని కొట్టి దాని మొద్దుపై ఈ బొమ్మని మలిచారు.
* అందుకు ఏకంగా 20 మంది దాదాపు మూడేళ్ల పాటు శ్రమించారు.
* ఇది 47.5 అడుగుల పొడవు, 16.5 అడుగుల ఎత్తు, 13 అడుగల వెడల్పూ ఉంది. దాని దగ్గర నిలబడితే నేను దాని కాలంతైనా లేను.
* చైనాలో డెంగ్‌డింగ్‌ రుయో అనే మామయ్య ఇలాంటివి చేయడంలో సిద్ధహస్తుడట. ఆయన ఆధ్వర్యంలో దీన్ని మయన్మార్‌లో తయారుచేశారు.
* అక్కడి నుంచి దీన్ని జాగ్రత్తగా ఉహాన్‌కి చేర్చారు. ఇప్పుడు అక్కడ నాలుగురోడ్ల కూడలిలో ఠీవీగా నిలబడి ఉన్న ఈ సింహాన్ని చూసేందుకు నాలానే బోలెడు మంది అక్కడికి వచ్చి వెళుతున్నారు. మరిక ఉంటానేం. బైబై


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని