భలే చక్రమండీ! ఎక్కేద్దాం పదండి!!

పేద్ద చక్రంలా ఉండి గుండ్రంగా రయ్యి రయ్యిమని తిప్పేసే ‘ఫెర్రిస్‌ వీల్‌’ తెలుసుగా? అలాంటి వాటిలో ఓ ప్రత్యేకమైనదాన్ని ఈమధ్యే చైనాలోని వీఫాంగ్‌ నగరంలో ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? చువ్వలు లేని ఏకైక ఫెర్రిస్‌ వీల్‌ ఇది. పైగా ప్రపంచంలో ఎత్తయిన వీల్స్‌లో ఒకటైన...

Published : 23 May 2017 01:19 IST

భలే చక్రమండీ! ఎక్కేద్దాం పదండి!!

పేద్ద చక్రంలా ఉండి గుండ్రంగా రయ్యి రయ్యిమని తిప్పేసే ‘ఫెర్రిస్‌ వీల్‌’ తెలుసుగా? అలాంటి వాటిలో ఓ ప్రత్యేకమైనదాన్ని ఈమధ్యే చైనాలోని వీఫాంగ్‌ నగరంలో ఏర్పాటు చేశారు.
* దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? చువ్వలు లేని ఏకైక ఫెర్రిస్‌ వీల్‌ ఇది. పైగా ప్రపంచంలో ఎత్తయిన వీల్స్‌లో ఒకటైన ‘లండన్‌ ఐ’ కన్నా ఇదే పెద్దది.
* 1,771 అడుగుల ఎత్తులో ఉన్న బైలాంగ్‌ రివర్‌ బ్రిడ్జ్‌పై కట్టిన ఈ జెయింట్‌ వీల్‌ ఎత్తు ఏకంగా 476 అడుగులు.
* మొత్తం 36 గదులతో ప్రత్యేకమైన భారీ ఉంగరంలా కనిపిస్తూ ఈ వీల్‌ అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. ఒక్కో గదిలో పది మంది కూర్చోవడానికి వీలున్న ఈ రైడులో టీవీ, వైఫై వంటి సౌకర్యాలూ ఉన్నాయి.
* ఈ చక్రం దృఢంగా ఉండటానికి పెద్ద స్టీలు స్తంభాల్ని అమర్చి ఉంచారు.
* దీని తయారీకి 4,600 టన్నుల ఉక్కును ఉపయోగించారట.
* మొత్తం చక్రం తిరిగి రావడానికి 28 నిమిషాల సమయం పడుతుంది.

మీకు తెలుసా?
* మొదటిసారిగా 1893లో షికాగోలో జెయింట్‌ వీల్‌ను నిర్మించారు. జార్జ్‌ ఫెర్రిస్‌ దీన్ని నిర్మించడంతో దీనికి ఫెర్రిస్‌ వీల్‌ అనే పేరొచ్చింది.
* దీనికే బిగ్‌ వీల్‌, అబ్జర్వేషన్‌ వీల్‌ అనే పేర్లూ ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని