ధనం... ఇంధనం... ఇక్కడి ప్రత్యేకతలు!

కువైట్‌... పశ్చిమ ఆసియాలోని ఓ బుల్లి దేశం. పర్షియన్‌ గల్ఫ్‌ తీరంలో ఉండే ఈ అరబిక్‌ దేశంలో మొత్తం తొమ్మిది దీవులుంటాయి. దక్షిణాన సౌదీ అరేబియా, ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో ఇరాక్‌ దేశాలు సరిహద్దులు. కువైట్‌లో ఎక్కువ భాగం ఎడారి ఆక్రమించి ఉంది. ఇక్కడ అత్యంత ఎత్తయిన ప్రాంతం సముద్రమట్టం నుంచి 306 మీటర్ల ఎత్తులో ఉంటుంది.....

Published : 18 Jun 2017 01:52 IST

కువైట్‌
ధనం... ఇంధనం... ఇక్కడి ప్రత్యేకతలు!

* కువైట్‌... పశ్చిమ ఆసియాలోని ఓ బుల్లి దేశం. పర్షియన్‌ గల్ఫ్‌ తీరంలో ఉండే ఈ అరబిక్‌ దేశంలో మొత్తం తొమ్మిది దీవులుంటాయి. దక్షిణాన సౌదీ అరేబియా, ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో ఇరాక్‌ దేశాలు సరిహద్దులు.

* కువైట్‌లో ఎక్కువ భాగం ఎడారి ఆక్రమించి ఉంది. ఇక్కడ అత్యంత ఎత్తయిన ప్రాంతం సముద్రమట్టం నుంచి 306 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

* ప్రపంచంలోని అత్యంత ఉష్ణ దేశాల్లో ఇదీ ఒకటి. జూన్‌, ఆగస్టుల్లో ఇక్కడ వేడి మరింత ఎక్కువ. ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ దాటుతుందిట. ఏడాది పొడవునా ఇసుక తుఫాన్లు వస్తుంటాయి.


 

* ఈ దేశ ప్రధాన ఆర్థిక వనరు పెట్రోలియం. ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఇదీ ఒకటి.


 

* ఈ దేశ జాతీయ పక్షి ఫాల్కన్‌. ఇక్కడి డబ్బు నోట్లపై, స్టాంపులపై దీని బొమ్మ కనిపిస్తుంది.


 

*దేశం: కువైట్‌

* రాజధాని: కువైట్‌ నగరం

* జనాభా: 43,48,395 విస్తీర్ణం: 17,820 చదరపు కిలోమీటర్లు భాష: అరబ్బీ కరెన్సీ: కువైటీ దినార్‌


 

* రోబో జాకీల సాయంతో మొదటి సారిగా ఒంటెల పరుగు పందేల్ని ఏర్పాటుచేశారు. ఏటా ఫిబ్రవరిలో జరుగుతుంటాయీ పోటీలు.

* ఇక్కడ మంచి నీటి సరస్సులు ఉండవు. సముద్రపు నీటి నుంచి ఉప్పు వేరు చేసి తాగడానికీ, ఇంటి అవసరాలకూ వాడుకుంటారు. * ఇక్కడికి వలసలు ఎక్కువ. అత్యధిక వలస వచ్చే దేశాల్లో ఇది మూడోస్థానంలో ఉంది.


 

* జెండా: ఆకుపచ్చ రంగు.. అరబ్‌ దేశాల సుసంపన్నతకు, నలుపు శత్రువుల ఓటమికి, ఎరుపు శత్రువుల రక్తపాతానికి, తెలుపు స్వచ్ఛతకి గుర్తులు.


 

* వివిధ దేశాల కరెన్సీ కన్నా కువైటీ దినార్‌కు విలువ ఎక్కువ. ఒక్క కువైటీ దినార్‌ విలువ మన రూపాయిల్లో దాదాపు 211 రూపాయిలు.

* 1930లో మొదటిసారిగా ఈ దేశంలో ఇంధన వనరుల్ని గుర్తించారు. దేశదేశాలు వాడే ఇంధనంలో 20 శాతం ఇక్కడిదే.

* బ్రిటన్‌ నుంచి 1961లో స్వాతంత్య్రం పొందిందిది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని