బల్లిలాంటి బళ్లు... ముళ్లలాంటి పళ్లు!

హాయ్‌ పిల్లలూ! నేనో వింత చేపను. పైగా చాలా అరుదైన దాన్ని. సముద్ర లోతుల్లో కొచ్చిన మీ శాస్త్రవేత్తలకు ఈ మధ్యే నేను కనిపించా. దీంతో వారు తెగ మురిసిపోయారు. వారు చెప్పే వరకూ ఆగడం ఎందుకు? నా సంగతులేవో నేనే చెప్పేసుకుందామని ఇలా వచ్చేశానంతే...

Published : 29 Jun 2017 01:12 IST

బల్లిలాంటి బళ్లు... ముళ్లలాంటి పళ్లు!

హాయ్‌ పిల్లలూ! నేనో వింత చేపను. పైగా చాలా అరుదైన దాన్ని. సముద్ర లోతుల్లో కొచ్చిన మీ శాస్త్రవేత్తలకు ఈ మధ్యే నేను కనిపించా. దీంతో వారు తెగ మురిసిపోయారు. వారు చెప్పే వరకూ ఆగడం ఎందుకు? నా సంగతులేవో నేనే చెప్పేసుకుందామని ఇలా వచ్చేశానంతే

* నా పేరు ‘లిజార్డ్‌ ఫిష్‌’. నేను కాస్త బల్లి పోలికలతో ఉంటానని నాకా పేరొచ్చేసింది.

* మామూలుగా అయితే అన్ని చేపల్లాగే ప్రశాంతంగా ఉంటాన్నేను. నా మీద శత్రువెవరైనా దాడి చేయడానికి ప్రయత్నించిందనుకోండి? ఒక్కసారిగా నా నోటిని పేద్దగా చాపేస్తా. ఎందుకంటే నాకు నోరంతా వరుసలు వరుసల్లో వందలాది పళ్లుంటాయి. అవి అచ్చం ముళ్లలానే ఉంటాయి. వాటిని చూసి శత్రువెవరైనా బెదిరిపోవాల్సిందే.

 

* ఇక చిన్న జీవి ఏదైనా నా నోట్లో పడిందే అనుకోండి? తప్పించుకునే ప్రసక్తే లేదు. నాకు విందు భోజనం కావల్సిందే.

* నేను సముద్రాల్లో ఎక్కడో చాలా లోతుల్లో ఉంటా. మీ శాస్త్రవేత్తలు 4000 మీటర్ల లోతుకొస్తే అక్కడ కనిపించాన్నేను. అందుకే మా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. పైగా మా సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉందట.

* నాలో మరో గమ్మత్తైన విషయం ఉంది తెలుసా. కొన్నాళ్లపాటు మగ చేపగా ఉండి, తర్వాత ఆడ చేపగా మారిపోగలను.

* సన్నగా ఉండి, రెండు అడుగుల పొడవు మాత్రమే ఎదుగుతాను. మరిక ఉంటానే నేను. బైబై.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని