డబ్బుల సంతలుంటాయిక్కడ!

ఆఫ్రికా ఖండంలోని వెనుకబడిన చిన్న దేశం సోమాలియా. పడమరన ఇథియోపియా, వాయువ్యంలో డిజిబౌటి, నైరుతిలో కెన్యా, మిగిలిన వైపుల హిందూ మహా సముద్రం దీనికి సరిహద్దులు. గతంలో ఇది బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల అధీనంలో ఉండేది. 1960లో వారి నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందింది.....

Published : 02 Jul 2017 01:48 IST

డబ్బుల సంతలుంటాయిక్కడ!
సోమాలియా

* ఆఫ్రికా ఖండంలోని వెనుకబడిన చిన్న దేశం సోమాలియా.

* పడమరన ఇథియోపియా, వాయువ్యంలో డిజిబౌటి, నైరుతిలో కెన్యా, మిగిలిన వైపుల హిందూ మహా సముద్రం దీనికి సరిహద్దులు.

* గతంలో ఇది బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల అధీనంలో ఉండేది. 1960లో వారి నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందింది.


* దేశం: సోమాలియా రాజధాని: మొగాదిషు జనాభా: దాదాపు 1,23,16,895 విస్తీర్ణం: 6,37,657 చదరపు కిలోమీటర్లు కరెన్సీ: సోమాలి షిల్లింగ్‌ అధికారిక భాషలు: సోమాలి, అరబిక్‌

* జెండా: మొత్తం నీలం రంగులో ఉండే జెండా మధ్యలో తెల్లటి నక్షత్రం ఉంటుంది. అది సోమాలియాలోని వివిధ తెగల ప్రజల ఐక్యతకు నిదర్శనం.


 

* వ్యవసాయమే ఇక్కడి వారి ప్రధాన జీవనాధారం. మొక్కజొన్న, అరటి... లాంటి వాటిని పండిస్తారిక్కడ.

* ఆకలి చావులు అధికంగా ఉన్న పేద దేశమిది.

* అక్షరాస్యత చాలా తక్కువ (కేవలం 38 శాతమే).

* ఇక్కడి పౌరుల్లో చాలామంది సముద్ర దొంగలే. ఓడల్ని దోచుకుంటూ జీవనం సాగిస్తారు.

ప్రభుత్వానికి ఎవరూ సరిగ్గా పన్నులు కట్టరు. దీంతో ప్రభుత్వానికి ఎప్పుడూ డబ్బు కొరతే.

* వీరి కరెన్సీ విలువా చాలా తక్కువే. మన రూపాయికి 11 సోమాలి షిల్లింగులు వస్తాయి.

* విచిత్రంగా ఇక్కడ డబ్బుల సంతలు ఉంటాయి. విదేశీయులు ఎవరైనా అక్కడ తమ డబ్బును మార్చుకోవచ్చు. మనం ఏడువందల రూపాయలిస్తే దాదాపు 5కిలోలకు పైగా బరువున్న సోమాలి షిల్లింగు కట్టల్ని సంచిలో మోసుకు వెళ్లాల్సిందే.

* ఇక్కడ అతి ఎత్తైన పర్వత ప్రాంతం షింబిరిస్‌. సముద్ర మట్టానికి ఇది 2,416 మీటర్ల ఎత్తులో ఉంటుంది. * ఇక్కడ రవాణా, పాలు, మాంసానికి ఎక్కువగా ఒంటెలపైనే ఆధారపడతారు.

* అచ్చం జారుడు బల్లలా ఉండే లమాదయా జలపాతాన్ని ఇక్కడ చూడొచ్చు.

* దీనికి పొడవైన తీర రేఖ ఉంది. బీచ్‌లు ఎక్కువే ఉన్నా ఇక్కడ నేరాల రేటు చాలా ఎక్కువ. అందుకే విదేశీయులు ఇక్కడ పర్యటించేందుకు భయపడతారు.

* ఆఫ్రికాలో అతి తక్కువ ఫోన్‌ కాల్‌ ధరలున్నది ఇక్కడే.

* ప్రధాన నదులు షిబెల్లే, జుబే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని