అతి పెద్ద బంగారు గని!

ఎరుపు రంగు మనిషి రక్తానికి, తెలుపు రంగు ఆత్మకు గుర్తులు. * ఇండోనేషియా... ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియాలోని ఈ ద్వీప దేశంలో మొత్తం 17,800 ద్వీపాలుంటాయి. ఇందులో సగం ద్వీపాలకు ఇంకా పేర్లే లేవు. * హిందూ, పసిఫిక్‌ సముద్రాల మధ్య ఉందిది....

Published : 09 Jul 2017 01:57 IST

అతి పెద్ద బంగారు గని!
ఇండోనేషియా

దేశం: ఇండోనేషియా
రాజధాని: జకార్తా
జనాభా: 26,35,10,146
విస్తీర్ణం: 19,04,569 చదరపు కిలోమీటర్లు
భాష: ఇండోనేషియన్‌
కరెన్సీ: రుపయా


జెండా: ఎరుపు రంగు మనిషి రక్తానికి, తెలుపు రంగు ఆత్మకు గుర్తులు.

* ఇండోనేషియా... ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియాలోని ఈ ద్వీప దేశంలో మొత్తం 17,800 ద్వీపాలుంటాయి. ఇందులో సగం ద్వీపాలకు ఇంకా పేర్లే లేవు.
* హిందూ, పసిఫిక్‌ సముద్రాల మధ్య ఉందిది.
* ఈ దేశం ఎన్నో అరుదైన జీవజాతులకు నిలయం. 2010లో ఇక్కడ 200 రకాల కొత్త జీవుల్ని గుర్తించారు. జవన్‌ రైనో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.

* ప్రపంచంలో రెండో అతి పెద్ద తీర ప్రాంతం ఉండేది ఈ దేశానికే.
* ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని ‘గ్రాస్‌బెర్గ్‌’ ఇక్కడిదే. మూడో అతి పెద్ద రాగి గని కూడా ఇక్కడే ఉంది.
* జీవ వైవిధ్యంలో రెండో స్థానంలో ఉందిది.

* ఇక్కడి జావా ద్వీపంలో ఆదిమ మానవుడు సంచరించినట్టు రుజువులున్నాయి.
* అతి పెద్ద బల్లి జాతికి చెందిన ‘కొమడో డ్రాగన్‌’ ఈ దేశ జాతీయ జంతువు.
* దేశంలో సగభాగం అడవులతో నిండి ఉంటుంది.

* ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లీసియా ఆర్నాల్డి’ని ఇక్కడ చూడొచ్చు. ఈ పూల రేకులు ఒకటిన్నర అడుగుల పొడవు, అంగుళం మందంతో ఉంటాయి.
* తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగే పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’లో ఈ దేశమూ ఓ భాగం. మొత్తం 400 అగ్ని పర్వతాలుంటే వాటిలో 150 క్రియాశీలకమైనవి. *ప్రపంచంలో ఇలాంటి ప్రమాదకర అగ్నిపర్వతాల్లో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.


* ఇక్కడ ఓ ప్రత్యేకమైన అగ్నిపర్వతం ఉంటుంది. దీన్నించి వచ్చే అగ్నిజ్వాలలు నీలం రంగులో ఉంటాయి.
* ఇక్కడి ప్రజలు దాదాపు 600 భాషలు, మాండలికాల్లో మాట్లాడుతారు.
* అతి పెద్ద బుద్ధుడి గుడి ‘బొరొబుడుర్‌’ ఉన్నది ఇక్కడే. 504 బుద్ధుని విగ్రహాలతో ఉంటుందీ ఆలయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని