మొదటి పుస్తకం అచ్చయింది ఇక్కడే!

* ఐరోపా దేశాల్లో అధిక జనాభా ఉన్న రెండో దేశం జర్మనీ. విస్తీర్ణాన్ని బట్టి ఏడోది. * ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ సహా తొమ్మిది దేశాలతో సరిహద్దులు పంచుకుందిది. * రహదారిపై వెళ్లే వాహనంలో పెట్రోలు అయిపోవడం, పిల్లికి గోళ్లు కత్తిరించడం నేరం. అందుకు జరిమానాలూ విధిస్తారు. * గడిచిన దశాబ్దంలో ఇక్కడ జనాభా 20 లక్షలు తగ్గింది. చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో గతŒ 25 ఏళ్లలో రెండు వేలకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి.

Published : 16 Jul 2017 02:12 IST

మొదటి పుస్తకం అచ్చయింది ఇక్కడే!
జర్మనీ

* ఐరోపా దేశాల్లో అధిక జనాభా ఉన్న రెండో దేశం జర్మనీ. విస్తీర్ణాన్ని బట్టి ఏడోది.
* ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ సహా తొమ్మిది దేశాలతో సరిహద్దులు పంచుకుందిది.

* రహదారిపై వెళ్లే వాహనంలో పెట్రోలు అయిపోవడం, పిల్లికి గోళ్లు కత్తిరించడం నేరం. అందుకు జరిమానాలూ విధిస్తారు.


* గడిచిన దశాబ్దంలో ఇక్కడ జనాభా 20 లక్షలు తగ్గింది. చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో గతŒ 25 ఏళ్లలో రెండు వేలకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి.


* బర్గర్లలో ఒక రకమైన హమ్‌ బర్గర్లు తెలుసా? ఇక్కడి హమ్బర్గ్‌ నగరం పేరు మీదనే వాటికి ఆ పేరు వచ్చింది.


దేశం: జర్మనీ రాజధాని: బెర్లిన్‌

జనాభా: 8,21,75,700 విస్తీర్ణం: 3,57,168 చదరపు కిలోమీటర్లు
కరెన్సీ: యూరో అధికారిక
భాష: జర్మన్‌


జెండా: నలుపు, ఎరుపు, బంగారు రంగులు దేశ ఐక్యతకు చిహ్నాలు.


* ప్రపంచంలోనే మొదటి మ్యాగజీన్‌ 1663లో ప్రచురితమైందిక్కడే. మొదటి పుస్తకం అచ్చయినదీ ఇక్కడే.

* జైలు నుంచి పారిపోయినవారికి ఇక్కడ శిక్షలు ఉండవు. అది మనిషి హక్కట.

* దీని రాజధాని నగరం ఏడుసార్లు మారి ఇప్పుడు బెర్లిన్‌గా ఉంది. అత్యధిక వంతెనలున్న నగరాల్లో ఇదొకటి. మొత్తం 960 వంతెనలున్నాయి.


 

* కోకోకోలా సంస్థదైన ‘ఫాంటా’ కూల్‌డ్రింక్‌ పుట్టిందిక్కడే.

* మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ఈ దేశం పాత్ర ఉంది. ఫలితంగా లక్షల మంది స్థానికులు చనిపోయారు.

* మొదటి ప్రపంచ యుద్ధం కోసం ఈ దేశం చేసిన అప్పు 96 వేల టన్నుల బంగారం ఖరీదుకు సమానం!

* చైనీస్‌ చక్కర్స్‌ ఆట పుట్టిందిక్కడే.


* ప్రపంచంలోనే పొడవైన చర్చి ఉల్మ్‌ మిన్‌స్టర్‌ ఇక్కడి ఉల్మ్‌లో ఉంది.

* ఐరోపా ఖండంలో అతి పెద్ద విమానాశ్రయం బెర్లిన్‌లో ఉన్నదే.

* మూడొంతుల భూభాగం అడవులు, చెట్లతో నిండి ఉంటుంది.

* 300కుపైగా రకాల బ్రెడ్‌లుంటాయిక్కడ.

* ప్రముఖ బ్రాండ్లు అడిడాస్‌, ప్యూమా ఇక్కడివే.


* మునిచ్‌ నగరంలోని విమానాశ్రయానికి విమానాలు కచ్చితమైన సమయానికి వస్తాయట. ప్రపంచంలో సమయపాలన గల విమానాశ్రయాల్లో దీనిది రెండో స్థానం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని