ఎమెజీలు నడిచొచ్చాయ్‌... రికార్డు కొట్టేశాయ్‌!

ఎమోజీలు ఫోన్‌ల్లోనే ఉంటాయనుకుంటాం. అయితే ఈమధ్య ఓ ఎమోజీ... నవ్వుతూ రోడ్డు మీదికొచ్చింది. మరోటి ఏడుస్తూ... ఇంకోటి హైఫై కొడుతూ... ఇలా బోలెడన్ని బిలబిలమంటూ రోడ్డు పైకొచ్చేశాయి. దీంతో ఒక్కసారిగా వాటిని చూసిన వారంతా ఎగిరి గంతులేశారు. పరుగు పరుగున వాటి దగ్గరకెళ్లి కెమేరాలకు పనిచెప్పారు. సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు.....

Published : 21 Jul 2017 01:51 IST

ఎమెజీలు నడిచొచ్చాయ్‌...రికార్డు కొట్టేశాయ్‌!


ఎమోజీలు రోడ్డుపైకొచ్చాయ్‌...
సెల్ఫీలు దిగి సందడి చేశాయ్‌...
పనిలో పనిగా ఓ రికార్డూ కొట్టేశాయ్‌...
ఏమిటో ఈ చిత్రం చదివేద్దాం రండి!

మోజీలు ఫోన్‌ల్లోనే ఉంటాయనుకుంటాం. అయితే ఈమధ్య ఓ ఎమోజీ... నవ్వుతూ రోడ్డు మీదికొచ్చింది. మరోటి ఏడుస్తూ... ఇంకోటి హైఫై కొడుతూ... ఇలా బోలెడన్ని బిలబిలమంటూ రోడ్డు పైకొచ్చేశాయి. దీంతో ఒక్కసారిగా వాటిని చూసిన వారంతా ఎగిరి గంతులేశారు. పరుగు పరుగున వాటి దగ్గరకెళ్లి కెమేరాలకు పనిచెప్పారు. సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు.
* ఇంతకీ సంగతేమంటే... మనుషులే ఎమోజీల ముసుగులేసుకుని ఇలా వీధుల్లో సందడి చేశారన్నమాట.
* పైగా ఈ హడావిడంతా ఒక్కచోట ఒక్క దేశంలో అనుకుంటే పొరపాటేనండోయ్‌. దుబాయ్‌ సిటీ, రష్యాలోని మాస్కో, ఇంగ్లండ్‌లోని లండన్‌, ఐర్లాండ్‌లోని డబ్లిన్‌, బ్రెజిల్‌లోని సౌపౌలోల్లో ఒకే సమయంలో ఈ సరదాలు చోటుచేసుకున్నాయి.
* ఎప్పుడనుకుంటున్నారు? ఈ మధ్య ప్రపంచ ఎమోజీల దినోత్సవం జరిగింది కదా! ఆ రోజే.
* ఐదు దేశాల్లో 531 మంది ఇలా వీటి ముసుగులు ధరించి రోడ్లపై సందడి చేసేశారు. ఫోన్‌, కంప్యూటర్లలోనే చూసుకునే ఈ బొమ్మల్ని రోడ్డు మీద ఇలా నడుస్తూ చూసేసరికి ఇక అక్కడున్నవారి ఆనందానికి అడ్డేలేదు.
* దీంతో ఇంత మంది పోగై చేసిన ఇలాంటి సరదా ఎమోజీల కార్యక్రమం ఇదేనంటూ గిన్నిస్‌బుక్‌ వీరికి రికార్డూ ఇచ్చేసింది.
* అన్నట్లు ఇదంతా ఎవరు, ఎందుకు చేయించారో చెప్పలేదు కదూ! సోనీ పిక్చర్స్‌ సంస్థ ‘ద ఎమోజీ’ త్రీడీ సినిమాని తీసింది కదా. త్వరలోనే అది విడుదలవుతోంది. దాని ప్రచారంలో భాగమే ఇదీనూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని