నడిచే వంతెనంట... ప్రపంచంలోనే పొడవంట!

అనగనగా ఓ వంతెన. అలా ఇలా ఉండదు. దానిపై నడవాలంటే ఎంతో గుండెధైర్యం ఉండాలి. ఎందుకంటే అది ఉండేది ఓ లోయపైన రెండు పర్వతాల మధ్య. ఈ మధ్యే ప్రారంభమైందిది. మీరు సాహసికులేనా? అయితే పదండి స్విట్జర్లాండ్‌లోని రాండాకి.....

Published : 02 Aug 2017 00:57 IST

నడిచే వంతెనంట... ప్రపంచంలోనే పొడవంట!

అనగనగా ఓ వంతెన. అలా ఇలా ఉండదు. దానిపై నడవాలంటే ఎంతో గుండెధైర్యం ఉండాలి. ఎందుకంటే అది ఉండేది ఓ లోయపైన రెండు పర్వతాల మధ్య. ఈ మధ్యే ప్రారంభమైందిది. మీరు సాహసికులేనా? అయితే పదండి స్విట్జర్లాండ్‌లోని రాండాకి.

* ఇక్కడి గ్రెచెన్‌, జెర్మట్‌ అనే వూళ్లను కలుపుతూ ఉంటుందీ వంతెన. పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వూగే వంతెన రికార్డు కూడా కొట్టేసింది. 1,620 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన వూగే పాదచారుల వంతెనగా పేరు తెచ్చేసుకుంది.

* నేలపై నుంచి 278 అడుగులు అంటే దాదాపు 28 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ వారధిపై నడవడమే ఓ సాహసం. దాదాపు 26 అంగుళాల వెడల్పుతో సన్నని దారిలా భలే గమ్మత్తుగా ఉంటుంది.

* దీని నిర్మాణానికి 80 టన్నులు కేబుళ్లు వాడారట. తయారీకి 10 వారాల సమయం పట్టిందట.

* ఈ ఎత్తయిన, పొడవైన వంతెనపై నడుస్తుంటే అచ్చం గాల్లో నడుస్తున్న వింత అనుభూతి కల్గుతుంది. చుట్టూ పరిసరాలు, పచ్చని చెట్లు కనువిందుచేస్తాయి.

* ప్రారంభమైన రెండు రోజుల్లోనే పర్యటకుల్ని తెగ ఆకట్టుకుంటోంది.


 

మీకు తెలుసా?
దన్యాంగ్‌ - కున్షన్‌ గ్రాండ్‌ బ్రిడ్జ్‌ ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన. ఇది బీజింగ్‌ - షాంఘై హైస్పీడ్‌ రైలు మార్గం కోసం నిర్మించారు. దీని పొడవు 164.8 కిలోమీటర్లు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని