ఓడలో ఎక్కేద్దాం... సముద్రం లోపల చూసేద్దాం!

ఎగసిపడే అలల మధ్య సముద్రంపై అందాల్ని చూడాలంటే ఓడలో ప్రయాణించాలి. మరి సముద్రపు నీటి లోపలి దృశ్యాల్ని చూడాలంటే ఏ డైవింగో చేస్తూ వెళ్లాలి. అయితే ఇవేమీ చెయ్యకుండానే ఒక్కసారే ఈ రెండు అనుభూతుల్ని పొందొచ్చు. ....

Published : 19 Aug 2017 01:05 IST

ఓడలో ఎక్కేద్దాం...సముద్రం లోపల చూసేద్దాం!

ఓ పెద్ద ఓడుంది...చాలా విలాసవంతమైనది...దానిలో ప్రయాణమూ గమ్మత్తయినది...ఏంటబ్బా? ఆ వివరాలేంటి? 
గసిపడే అలల మధ్య సముద్రంపై అందాల్ని చూడాలంటే ఓడలో ప్రయాణించాలి. మరి సముద్రపు నీటి లోపలి దృశ్యాల్ని చూడాలంటే ఏ డైవింగో చేస్తూ వెళ్లాలి. అయితే ఇవేమీ చెయ్యకుండానే ఒక్కసారే ఈ రెండు అనుభూతుల్ని పొందొచ్చు. ఒక్కసారే అటు సముద్రం పైకి, ఇటు నీటి లోపలకి చూడొచ్చు. ఓ ఓడలో ఇలాంటి ప్రయాణం చేయొచ్చు. పైగా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హైబ్రిడ్‌ ఛార్టర్డ్‌ ఓడట. దీని కబుర్లే ఇవి.

* సావన్నా అనే ఓడ లోపల... అడుగు భాగాన చక్కటి సోఫాలేసి హాయిగా కూర్చోడానికి వీలుగా ఉంటుంది. చుట్టూ అద్దాల గోడలుంటాయి. పారదర్శకంగా ఉన్న ఆ అద్దాల గోడల్లోంచి చూస్తే భలేగా సముద్రపు నీటి లోపలకి, పైకి రెండూ కనిపిస్తాయి.
* మొత్తం 273 అడుగుల పొడవుంటుందీ ఓడ. అంటే దాదాపు ఆరు స్కూలు బస్సులు ఒకదాని వెనక ఒకటుంటే ఎంత పొడవుంటాయో అంతన్నమాట!
* వెండి రంగులో మెరిసి పోతూ ఉంటుందిది. దీని అడుగు భాగం జలాంతర్గామి మాదిరిగా ఉంటుంది. స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, స్పా, లాంటి విలాసవంతమైన సౌకర్యాలైతే బోలెడు.
* నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఓడల తయారీ సంస్థ దీన్ని తయారు చేసింది. ప్రస్తుతం ఇది అమెరికా దగ్గరి పసిఫిక్‌ మహా సముద్రంలో చక్కర్లు కొడుతోంది.
* ఇంత పెద్ద ఓడలో ఒకటో రెండో టిక్కెట్లు తీసుకుని ప్రయాణించేద్దామంటే కుదరదండోయ్‌. ఎందుకంటే దీనిలో ప్రయాణిస్తూ ఈ వింత అనుభూతుల్ని సొంతం చేసుకోవాలంటే దీన్ని మొత్తంగా అద్దెకుతీసుకోవలసిందే. భారీగా డబ్బులు చెల్లించాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని