ఔరా... అమెజాన్‌!

అమెజాన్‌... ప్రపంచంలోనే పేద్ద అడవి. అంత వరకే మనకు తెలుసు కదూ. అబ్బురపరిచే విశేషాలు, అవునా అని ఆశ్చర్యపోయే విషయాలు దీనిలో బోలెడున్నాయి తెలుసా? కావాలంటే ఇది చదివి చూడండి.. * గ్రీకు పురాణాల్లో ఉన్న అమెజాన్స్‌ అనే పదం నుంచి ‘అమెజాన్‌’ అనే పదం వచ్చింది. వీరనారి అనిదీనర్థం.

Published : 13 Sep 2017 01:48 IST

ఔరా... అమెజాన్‌!

అమెజాన్‌... ప్రపంచంలోనే పేద్ద అడవి. అంత వరకే మనకు తెలుసు కదూ. అబ్బురపరిచే విశేషాలు, అవునా అని ఆశ్చర్యపోయే విషయాలు దీనిలో బోలెడున్నాయి తెలుసా? కావాలంటే ఇది చదివి చూడండి..

* గ్రీకు పురాణాల్లో ఉన్న అమెజాన్స్‌ అనే పదం నుంచి ‘అమెజాన్‌’ అనే పదం వచ్చింది. వీరనారి అనిదీనర్థం.
* దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల్లో అమెజాన్‌ విస్తరించి ఉంది. ఎక్కువ భాగం అంటే 60శాతం ఒక్క బ్రెజిల్‌లోనే ఉంటే మిగిలినది పెరూ, కొలంబియా, వెనిజులా, ఈక్విడార్‌, బొలీవియా, గయానా, సురినామ్‌, ఫ్రెంచ్‌ గుయానాల్లో ఉంది.

* సరాసరిన చూస్తే గత 111 ఏళ్లలో ఇక్కడ ప్రతి మూడు రోజులకూ ఓకొత్త జాతి బయటపడుతోందట. దీన్ని బట్టే అర్థమవుతోంది కదూ... ఇదో జంతువుల గని అని!
* తాజా నివేదికలు చూస్తే 2014, 2015ల్లోనే ఇక్కడ 381 కొత్త జాతులు బయటపడ్డాయి. వాటిలో నదుల్లో జీవించే గులాబిరంగు డాల్ఫిన్‌, ఫైర్‌టైల్‌ కోతులులాంటి గమ్మత్తయిన జంతువులూ ఉన్నాయి.
* బుల్లికీటకాలే 25 లక్షలకు పైగా ఉన్నాయని అంచనా.
* ఈ అడవిలో ప్రవహించే అమెజాన్‌ నదిపైన ఒక్క వంతెనా లేదంటే నమ్ముతారా?
* ఈ అమెజాన్‌ నది అట్లాంటిక్‌ మహాసముద్రంలో కలుస్తుంది. పెద్ద ఎత్తున మంచి నీళ్లు దీని ద్వారా సముద్రంలో కలుస్తాయి. అందుకే ఈ నది కలిసే ప్రాంతంలో సముద్ర నీరు ఉప్పగా కాకుండా మంచిగానే ఉంటుందట.

* 55,00,000 చదరపు కిలోమీటర్ల అడవి ఇది. ఈ అడవంతా కలిపి ఒక దేశమై ఉంటే ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో 9వ స్థానంలో ఉండి ఉండేది!
* ప్రపంచంలో ఉన్న వర్షాధార అడవులన్నీ కలిపినా ఒక్క అమెజాన్‌ అంత ఉండవు.
* ప్రపంచవ్యాప్తంగా మనందరికీ అవసరమయ్యే ఆక్సిజన్‌లో 20% ఈ అమెజాన్‌ అడవుల నుంచే ఉత్పత్తి అవుతుంది. అందుకే వీటిని ప్రపంచానికి వూపిరితిత్తులు అని పిలుస్తారు.
* ప్రపంచ వ్యాప్తంగా అందరూ తినే 80% ఆహార పదార్థాలకు మూలం ఈ అడవే.
* ఇక్కడ 3000 రకాలకు పైగా పళ్ల చెట్లున్నాయి. వాటిలో మనం తినేవి కేవలం 200 రకాలే. అంటే మనకు తెలియని పళ్లు ఇంకా ఇక్కడ 2800 ఉన్నాయన్నమాట.
* సరాసరిన చూస్తే ఈ అడవిలోని ప్రతి రెండున్నర ఎకరాల భూమిలో 750 రకాల చెట్లు, 1500 రకాలకు పైగా మొక్కలు ఉన్నాయి.
* చెట్లు కొట్టేస్తూ ఇక్కడి భూమినీ చెట్లు లేకుండా చేసేస్తున్నాం. ఇలా సెకనుకు 1.5 ఎకరాల అటవీ భూమి తరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే మరో 40 ఏళ్లలో ఈ అడవి మొత్తం నామరూపాల్లేకుండా పోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని