పరీక్షల్లో కాపీ కొడితే.. ఏడేళ్ల శిక్ష

మనకెంతో ఇష్టమైన గాలిపటం పుట్టింది ఎక్కడో తెలుసా? ప్రపంచంలోని ఆటబొమ్మల్లో ఎక్కువ శాతం ఎక్కడ తయారవుతున్నాయో తెలుసా? జవాబులు కావాలంటే ఇది చదివేయండి మరి!

Published : 17 Sep 2017 01:50 IST

పరీక్షల్లో కాపీ కొడితే.. ఏడేళ్ల శిక్ష
చైనా 

మనకెంతో ఇష్టమైన గాలిపటం పుట్టింది ఎక్కడో తెలుసా? ప్రపంచంలోని ఆటబొమ్మల్లో ఎక్కువ శాతం ఎక్కడ తయారవుతున్నాయో తెలుసా? జవాబులు కావాలంటే ఇది చదివేయండి మరి!

* చైనా... ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఇదే.
* చైనా అనే పదంqinరాజవంశం నుంచి వచ్చింది. దీని ఉచ్చారణ చిన్‌. ఈ వంశం పేరు మీదుగానే ఈ దేశానికీ పేరొచ్చిందట.



దేశం: చైనా
రాజధాని: బీజింగ్‌
జనాభా: 1,40,35,00,365 విస్తీర్ణం: 95,96,961 చదరపు కిలోమీటర్లు
భాషలు: మాండరిన్‌, మంగోలియన్‌, టిబెటన్‌..
కరెన్సీ: చైనీస్‌ యువాన్‌


జెండా: ఎరుపు రంగు కమ్యూనిస్ట్‌ విప్లవానికి సూచిక ఇక్కడి ప్రజల సంప్రదాయ రంగు కూడా. పెద్ద నక్షత్రం కమ్యూనిజానికి గుర్తు. నాలుగు చిన్న నక్షత్రాకారాలు సామాజిక తరగతులను సూచిస్తాయి.
* చైనీయులు ఎరుపు రంగును సంతోషానికి గుర్తుగా భావిస్తారు. అందుకే రకరకాల పండగల్లోనే కాదూ... ప్రత్యేక సందర్భాల్లో, వివాహం లాంటి వేడుకల్లోనూ ఉపయోగిస్తారు ఆ రంగును.


*టాయిలెట్‌ పేపర్‌, మనకెంతో ఇష్టమైన గాలిపటాలు పుట్టింది చైనాలోనే.
*చైనాలో విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడితే ఏడేళ్ల శిక్ష విధిస్తారు.
* 2009 వరకు చైనాలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వాడటం నిషిద్ధం.
* ప్రపంచంలోని 70 శాతం ఆట బొమ్మలు తయారయ్యేది ఇక్కడే.
* ఎగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది చైనా. దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది.


* అతి ఎత్తయిన భవంతులు ఎక్కువగా ఉండటమే కాదు.. చైనాలో ప్రతి ఐదు రోజులకు సగటున ఓ ఆకాశహర్మ్యం లేస్తోంది.
*జనాభా మొత్తంలో 70శాతం మంది మాండరిన్‌ భాష మాట్లాడుతారు.
* ప్రపంచంలోనే పురాతన, పొడవైన కాలువ ‘చైనా గ్రాండ్‌ కెనాల్‌’. దీని పొడవు 1,794 కిలోమీటర్లు.
* చైనాలో పెద్దవారి కోసం ప్రత్యేక చట్టం ఉంది. వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే శిక్షలు పడతాయ్‌!

* చైనా క్యాలెండర్‌ ప్రపంచంలోని పురాతనమైన క్యాలెండర్లలో ఒకటి.

* కొన్ని పెద్ద దేశాల్లో టైమ్‌ జోన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ పెద్ద దేశమైన చైనాలో మాత్రం ఒక్కటే ‘బీజింగ్‌ స్టాండర్డ్‌ టైమ్‌ జోన్‌’ ఉంది. అంటే ఈ దేశమంతా ఒకే సమయం ఉంటుంది. అందువల్లే ఇక్కడి పడమర రాష్ట్రాల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
*ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’ మనకు తెలిసిందే. దాదాపు 2600 ఏళ్ల నాటి నిర్మాణమిది. ఏటా ఇక్కడికి ఐదు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారు.

* డబ్బుగా కాగితపు నోట్లని మొదటిసారిగా వాడింది చైనాలోనే. దాదాపు 1400 సంవత్సరాల క్రితం.

* సముద్ర ప్రయాణాల్లో ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్‌), మొట్ట మొదటి ముద్రణాయంత్రం, వూగే వంతెనలు, తుపాకీ మందు, ముడుచుకునే గొడుగుల్ని తయారు చేసింది కూడా చైనీయులే.

* సంఖ్యాపరంగా ప్రపంచంలోని మొత్తం పందుల్లో సగం చైనాలోనే ఉన్నాయి.
* చైనాలో కొంత మంది పోలీసులు కుక్కలకు బదులు పెద్ద బాతుల్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే కుక్కల్లానే వీటికి దొంగల్ని గుర్తించే శక్తి ఉందట.

* ప్రపంచంలో ఉన్న పాండాలన్నీ ఇక్కడివే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని