అధికార భాషలేని అగ్రరాజ్యం

అమెరికా సంయుక్త రాష్ట్రాలు... ఉత్తర అమెరికా ఖండంలోని దేశం.మొత్తం 50 రాష్ట్రాలతో ఉండే ఈ దేశానికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలు భూ సరిహద్దులు. దీన్ని అమెరికా అనీ, యూఎస్‌ఏ అనీ పిలుస్తారు.

Published : 08 Oct 2017 01:41 IST

అధికార భాషలేని అగ్రరాజ్యం

అమెరికా సంయుక్త రాష్ట్రాలు... ఉత్తర అమెరికా ఖండంలోని దేశం.మొత్తం 50 రాష్ట్రాలతో ఉండే ఈ దేశానికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలు భూ సరిహద్దులు. దీన్ని అమెరికా అనీ, యూఎస్‌ఏ అనీ పిలుస్తారు.

 

దేశం: అమెరికా 
రాజధాని: వాషింగ్టన్‌ డి.సి
జనాభా: 32,53,65,189
విస్తీర్ణం: 98,33,520 చదరపు కిలోమీటర్లు
కరెన్సీ: డాలర్‌

జెండా: నీలం రంగు దీర్ఘచతురస్రంలోని తెలుపు నక్షత్రాలు అమెరికాలోని రాష్ట్రాలకు గుర్తులు. ఎరుపు, తెలుపు గీతలు మొట్టమొదటి 13 వలస ప్రాంతాలకు ప్రతీకలు.

* ప్రఖ్యాత నావికుడు క్రిస్టఫర్‌ కొలంబస్‌ అమెరికాను 1492లో కనుగొన్నాడు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘న్యూ వరల్డ్‌’ అని పిలుచుకునేవారు. కొలంబస్‌ను అనుసరించిన మరో నావికుడు ‘అమెరిగో వెస్పు’ ఈ ప్రాంతం గురించి చాలా పుస్తకాలు రాశారు. ఆయన పేరుమీదుగానే ఈ దేశానికి ‘అమెరికా’ అనే పేరు స్థిరపడింది.
* వైశాల్యపరంగా ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశమిది.
* అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది.
* ఈ దేశం మొత్తంలో ఎక్కువమంది జనాభా ఉన్న రాష్ట్రం న్యూయార్క్‌.
* దక్షిణ కరోలినా తీరంలో మొత్తం కోతులతో నిండిన ఒక ద్వీపం ఉంది.
* పిజ్జా ఇక్కడి వారి ఇష్టమైన ఆహారం. వీరు ఒక్క రోజులో తినే పిజ్జాలు 100 ఎకరాల్లో సరిపోతాయి. ప్రతి సెకనుకు 100 పౌండ్ల చాక్లెట్లు హాంఫట్‌మనిపిస్తారు.అంటే దాదాపు 46 కిలోలన్నమాట.
* ఈ దేశంలో ఎక్కువగా ఆంగ్లమే మాట్లాడుతారు. ప్రభుత్వం కూడా ఈ భాషనే వాడుతుంది. కానీ ఈ దేశానికి అధికారిక భాష మాత్రం లేదు.
 

* అమ్యూజ్‌మెంట్‌ పార్కులో ఉండే ఫెర్రిస్‌ వీల్‌ ఎక్కడమంటే ఎంతో సరదా కదూ. ఈ దేశానికి చెందిన జార్జ్‌ వాషింగ్టన్‌ గాలె ఫెర్రిస్‌ అనే ఆయన దీన్ని కనిపెట్టారు.
* విద్యుద్దీపం, ఏసీ, విమానం వంటి ఎన్నో ప్రముఖ ఆవిష్కరణలయ్యింది ఈ దేశంలోనే. వీటితో పాటు జిప్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌, మైక్రోఓవెన్‌, ఎల్‌ఈడీ లైట్లు పుట్టిందీ ఇక్కడే.

* నయాగరా జలపాతం, మిస్సిసీపీ నది అమెరికా పేరు వినగానే గుర్తొచ్చే ప్రకృతి అందాల ప్రాంతాలు.

జీన్స్‌ కనిపెట్టారు

నకు జీన్‌ ప్యాంట్‌ అంటే తెగ ఇష్టం. మరి దాన్ని ఎక్కడ కనిపెట్టారో తెలుసా? అమెరికాలోనే. లేవీ స్ట్రాస్‌, జాకోబ్‌లు తయారు చేశారు. గట్టిగా ఉండే డెనిమ్‌ వస్త్రంతో 1873లో మొదటి జీన్స్‌ దుస్తులు తయారు చేశారు.

స్వేచ్ఛకు చిహ్నం

అమెరికా అనగానే లిబర్టీ విగ్రహం గుర్తుకు వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ లిబర్టీ విగ్రహం స్వేచ్ఛను చాటుతుంది. దీన్ని ఫ్రాన్స్‌ బహుమతిగా ఇచ్చింది. యు.ఎస్‌.ఎ. ఏర్పడి వందేళ్లయిన సందర్భంగా రూపు దిద్దుకున్న ఈ విగ్రహాన్ని 1886లో నిల బెట్టారు. దీనిని ప్రఖ్యాత శిల్పి ఆగస్టీ బార్థోల్డి రూపొందించారు.

రష్యా దగ్గర కొన్నారు

అమెరికాకు అలస్కా రాష్ట్రాన్ని 1867లో రష్యా అమ్మింది. రెండు సెంట్లకు ఒక ఎకరం చొప్పున. ఈ దేశంలోని రాష్ట్రాల్లో అలస్కానే పెద్దది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని