ఎంతెంత ఎత్తంట!

గిన్నిస్‌బుక్‌.. ఈ పేరు వింటేనే గమ్మత్తయిన సంగతులు, భలే భలే రికార్డులు గుర్తొస్తాయ్‌.. ఇప్పటి వరకూ ఈ బుక్‌లోకెక్కిన అతి ఎత్తైన వాటన్నింటినీ ఒక్కచోట చేరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారో ఏమో గిన్నిస్‌బుక్‌ వాళ్లు. అదే పని చేశారు. 1951 నుంచి ఏటా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.

Published : 23 Oct 2017 01:45 IST

ఎంతెంత ఎత్తంట!

గిన్నిస్‌బుక్‌.. ఈ పేరు వింటేనే గమ్మత్తయిన సంగతులు, భలే భలే రికార్డులు గుర్తొస్తాయ్‌.. ఇప్పటి వరకూ ఈ బుక్‌లోకెక్కిన అతి ఎత్తైన వాటన్నింటినీ ఒక్కచోట చేరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారో ఏమో గిన్నిస్‌బుక్‌ వాళ్లు. అదే పని చేశారు. 1951 నుంచి ఏటా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఈ పుస్తకంలో అత్యంత ఎత్తైనవిగా కొన్నింటికి రికార్డులున్నాయి. చాలా కాలంగా చెదిరిపోకుండా ఉన్న వాటి ‘రికార్డు’ వివరాలు చదివేద్దామా?
 

మెగా పిరమిడ్‌!

నకు పిరమిడ్లనగానే ఈజిప్టు గుర్తొచ్చేస్తుంది. అయితే వాటిల్లో అతి పెద్దదేంటో తెలుసా? అక్కడి గిజాలో ఉన్న ‘ద గ్రేట్‌ పిరమిడ్‌’. దీని ఎత్తు 481 అడుగులు. 4,500ఏళ్ల క్రితం దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనికి ‘ద పిరమిడ్‌ ఆఫ్‌ ఖుఫు’ అని మరో పేరూ ఉంది.

వారెవ్వా డైనోసార్‌!

న శాస్త్రవేత్తలకు ఎప్పుడూ బోలెడు డైనోసార్‌ల శిలాజాలు దొరుకుతూనే ఉంటాయి. అలా ఇప్పటి వరకూ మనకు దొరికిన వాటిలో అతి పెద్దది సారోపోసెయ్‌డన్‌ జాతి డైనోసార్‌ది. అమెరికాలోని ఓక్లహోమాలో దొరికింది. ఇది 60 అడుగుల పొడవుంది. అంటే ఇంచుమించు ఆరంతస్తుల భవనమంత ఎత్తు. దీని బరువు 60 టన్నులు. అంటే 60వేల కేజీలు.

చాక్లెట్‌ గుడ్డు!

కంగా చెట్టంత చాక్లెట్‌ గుడ్డు కళ్లముందు కనిపిస్తే నోట్లో నీళ్లూరకుండా ఉంటాయా? 2011లో ఈస్టర్‌ పండుగ సందర్భంగా 64 అడుగుల ఎత్తున చాక్లెట్‌ గుడ్డును తయారుచేశారు. ఈస్టర్‌ గుడ్లలో ఇదే అతి పెద్ద చాక్లెట్‌ గుడ్డుమరి. ఇది దాదాపుగా ఆరంతస్తుల భవనమంత ఎత్తుంది. అన్నట్టు దీని బరువెంతో చెప్పలేదు కదూ. ఏకంగా 7.2 టన్నులు!

ఔరా జలపాతం!

ప్రపంచంలో అతి ఎత్తు నుంచి పడే జలపాతంగా ‘ఏంజెల్‌ ఫాల్‌ü్స’ ఉంది. ఇది 3,212 అడుగుల ఎత్తు నుంచి ఏక ధారగా కిందికి పడుతుంది. ఇది వెనిజులాలో ఉంది. అమెరికన్‌ పైలెడ్‌ జిమ్మి ఏంజెల్‌ పేరు మీదిగా దీనికి ఈ పేరొచ్చింది.

అదిరే విగ్రహం!

విగ్రహాల్లో అతి ఎత్తైనది చైనాలో ఉంది. దీని పేరు ‘ద జోంగ్యున్‌ బుద్ధ’ ఇది అక్కడి హెనాన్‌ ప్రావిన్సులో ఉంది. దీని పొడవు 418 అడుగులు. ఈ బుద్ధుడి ప్రతిమ మామూలు మనిషి కంటే దాదాపుగా 70 ఇంతలుంటుంది. 2009లో దీనికీ రికార్డు దక్కిందిగానీ ఇప్పటి వరకూ మరేదీ దీన్ని బద్ధలుగొట్టలేదు.

ఆకాశమంత చెట్టు!

ప్రపంచంలో అతి ఎత్తైన చెట్టు ‘హైపేరియన్‌’. ఇది రెడ్‌ఉడ్‌ జాతిది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ‘రెడ్‌ ఉడ్‌ నేషనల్‌ పార్క్‌’లో ఉందిది. ఎప్పుడో 2006లో ఓ సారి దీన్ని కొలిస్తేనే 379 అడుగుల పొడవుంది. అంటే 35 అంతస్తుల భవనంకంటే ఎక్కువ ఎత్తు. ఇప్పటికీ ఇది ఇంకా అలా పైపైకి ఎదుగుతూనే ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని