ముడుచుకున్నమ్మ..

ఓ చక్కని మొక్క ఉంది... చిత్రమైనదది... ఎండుటాకుల బంతిలా ఉంటుంది... నీరు తగలగానే పచ్చగా మారుతుంది... ఇంతకీ ఏంటా మొక్క?ఏంటి దాని ప్రత్యేకత?.......

Published : 29 Jan 2018 02:07 IST

ముడుచుకున్నమ్మ.. మొక్కగా మారెనమ్మ!

ఓ చక్కని మొక్క ఉంది... చిత్రమైనదది... ఎండుటాకుల బంతిలా ఉంటుంది... నీరు తగలగానే పచ్చగా మారుతుంది... ఇంతకీ ఏంటా మొక్క?ఏంటి దాని ప్రత్యేకత?అమ్మతోనో నాన్నతోనే మనం బయటకు వెళ్లినప్పుడు బజారుల్లో, తిరునాళ్లలో ఓ రకమైన నాచులాంటి మొక్కను అమ్ముతుంటారు. ఎండి పోయిన ఆకుల బంతిలా ఉండే దాన్ని అమ్మేవాడు నీళ్లలో వేసి పచ్చని మొక్కను చేసి అక్కడ పెడుతుంటాడు. నీళ్లలో వేస్తే పచ్చగా ఇలా అవుతుందని చూపుతూ ఎండుమొక్కల్ని అమ్మేస్తుంటాడు. గుర్తొచ్చింది కదూ. ఇంతకీ ఏంటా మొక్క? నీళ్లలో వేస్తే ఎందుకది పచ్చగా అవుతుంది. మీకేమైనా తెలుసా? తెలియదన్నట్లు చూడకండి. చకచకా బోలెడు కబుర్లు చదివేయండి.* గుల్మంలా పెరిగే ఈ మొక్క పేరు ‘రోజ్‌ ఆఫ్‌ జెరిచో’.
* పొడి నేలల్లో ఎక్కువగా పెరుగుతుంది.* చాలా సార్లు దీనికి నీళ్లు దొరకవు. అప్పుడు ఆకులన్నీ ఎండినట్లు చేసుకుని గుండ్రటి బంతిలా చుట్టుకుపోతుంది.
* ఏళ్ల తరబడి సజీవంగా ఉండేందుకే ఇది ఇలాంటి మాయ చేస్తుంది. దీనిలోని జీవాన్ని దాచుకునేందుకే ఇదిలా నిద్రాణ స్థితిలోకి చేరుకుంటుందన్నమాట.
* దీనికి కావల్సిన తేమ తగలగానే ఈ బంతి అంచెలంచెలుగా విప్పారుతుంది.* చక్కగా పచ్చని ఆకుల్ని విచ్చుకుని గుండ్రటి పువ్వులా మారిపోతుంది. దాదాపు అడుగు పొడవు మాత్రమే పెరుగుతుంది.* ఎండు మొక్కల్లా ఉన్న వీటి భాగాల్నే తెచ్చి మనకు బజారుల్లో అమ్ముతుంటారు. అయితే వాటికి వేళ్లు సరిగ్గా లేకపోతే పూర్తిగా పచ్చగా అవ్వవు. సగం ఎండిపోయినట్లే ఉంటాయి.
* దీనికి రోజ్‌ ఆఫ్‌ జెరిచో అనే కాదు ఇంకా చాలానే పేర్లున్నాయి. ట్రూ రోజ్‌ ఆఫ్‌ జెరిచో, మార్యమ్స్‌ ఫ్లవర్‌, ఫ్లవర్‌ ఆఫ్‌ సెయింట్‌ మేరీ, వైట్‌ మస్టర్డ్‌ ఫ్లవర్‌... తదితర పేర్లతోనూ దీన్ని పిలుస్తారు.* బ్రాసికేసియా కుటుంబానికి చెందినదిది. శాస్త్రీయ నామం అనాస్టాటికా.
* వీటి పుట్టిళ్లు అమెరికా, మెక్సికోల్లోని ఎడారులని చెబుతారు.
* ఎక్కువగా మధ్య ప్రాచ్యం, సహారా ఎడారి, ఇరాన్‌, ఈజిప్ట్‌, పాలస్తీనా, ఇజ్రాయిల్‌, సిరియా, ఇరాక్‌, జోర్డాన్‌, పాకిస్థాన్‌ల్లో కనిపిస్తుంటుంది. మన దగ్గర పొడి ప్రాంతాల్లోనూ అక్కడక్కడా ఇది దొరుకుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని