గాల్లో తేలినట్టు... గుండె జారినట్టు!

మీకు సాహసాలంటే ఇష్టమా... కళ్లు తిరిగే విన్యాసాలు చేయాలనుందా? గాల్లో రయ్యిమంటూ జారిపోవాలనుందా? అయితే ప్రపంచంలోనే అతి పొడవైన జిప్‌లైన్‌ ఎక్కేయాల్సిందే... ఇంతకీ ఎక్కడుంది? జర్రు జర్రున జారిపోయే రోలర్‌ కోస్టర్‌ ఎక్కాం...

Published : 09 Feb 2018 01:57 IST

గాల్లో తేలినట్టు... గుండె జారినట్టు!

మీకు సాహసాలంటే ఇష్టమా... కళ్లు తిరిగే విన్యాసాలు చేయాలనుందా? గాల్లో రయ్యిమంటూ జారిపోవాలనుందా? అయితే ప్రపంచంలోనే అతి పొడవైన జిప్‌లైన్‌ ఎక్కేయాల్సిందే... ఇంతకీ ఎక్కడుంది?
ర్రు జర్రున జారిపోయే రోలర్‌ కోస్టర్‌ ఎక్కాం... గుండ్రంగా చక్కర్లు కొట్టించే ఫెర్రిస్‌ వీల్‌ గురించి తెలుసు. మరి జిప్‌ లైన్‌ ఏంటీ? అనుకుంటున్నారా? ఎంతో ఎత్తులో పొడవైన
తీగల మీదుగా రయ్యిరయ్యిమంటూ గాల్లో తీసుకెళుతుంది. ఇలాంటి వాటిల్లోనే ఈమధ్య ప్రపంచంలోనే పొడవైన జిప్‌లైన్‌ ప్రారంభమైంది. ఇంతకీ ఎక్కడో చెప్పలేదు కదూ.. యూఏఈలోని రస్‌ అల్‌ ఖైమా దగ్గర.
* దీని పేరు ‘జెబెల్‌ జైస్‌ ఫ్లైట్‌’. ఆరంభంతో సాహసికుల్ని ఆకట్టుకోవడంతో పాటు పాత రికార్డును బద్ధలుకొట్టి గిన్నిస్‌ రికార్డూ కొట్టేసింది.
* ఈ రైడ్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎత్తయిన జెబెల్‌ జైస్‌ మౌంటేన్‌ దగ్గర ఏర్పాటు చేశారు దీన్ని. అటూ ఇటూ కొండల మధ్యలో బలమైన ఉక్కు తీగలుంటాయి. వీటి పొడవు ఏకంగా 2.8 కిలోమీటర్లు. అవే రైడ్‌కు ఆధారం. ఇంకేముంది త్రీ... టూ... వన్‌.... అని మీట నొక్కగానే సాహసికులు ఒక్కసారిగా భూమికి సమాంతరంగా జారిపోతారు. అచ్చం సూపర్‌మ్యాన్‌లా అన్నమాట.
* సముద్రమట్టానికి 1680 మీటర్ల ఎత్తులో దీనిపై జారుతూ పోతుంటే గాల్లో తేలుతున్నట్టు గుండె జారుతున్నట్టు వింత అనుభూతి కల్గుతుందట.
* ఎంత వేగంగా దూసుకు పోతుందంటే... 150 కిలోమీటర్ల వేగంతో. సుమారు మూడు నిమిషాల వ్యవధిలో ఈ రైడు మొత్తం పూర్తయిపోతుంది.
* ఇదంతా బాగానే ఉంది కానీ....  బాబోయ్‌ పడిపోతే ఎలా? అంటారా? ఆ బెంగే అక్కర్లేదు. ఎందుకంటే రైడు ఎక్కేముందే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. తలపై రక్షణ కవచం, నడుముకు, చేతులకు బెల్టుల్లాంటివన్నీ ఉంటాయి.
* ఇప్పుడు సందర్శకుల్ని తెగ ఆకట్టుకుంటోందీ రైడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని