నిజాయతీపరుల నేల ఇది!

బర్కీన ఫాసో పశ్చిమ ఆఫ్రికా ఖండంలోని దేశం. చుట్టూ భూభాగాలే ఈ దేశ సరిహద్దులు. మాలి, నైగర్‌, బెనిన్‌, టోగో, ఘనా, ఐవరీ కోస్ట్‌ దేశాలు దీనికి సరిహద్దులు. బర్కీన ఫాసో అంటే ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఆనెస్ట్‌ పీపుల్‌’ అని అర్థం. ఇది ఆఫ్రికా ఖండంలో.....

Published : 10 Feb 2018 01:21 IST

నిజాయతీపరుల నేల ఇది!
బర్కీన ఫాసో

ర్కీన ఫాసో పశ్చిమ ఆఫ్రికా ఖండంలోని దేశం. చుట్టూ భూభాగాలే ఈ దేశ సరిహద్దులు. మాలి, నైగర్‌, బెనిన్‌, టోగో, ఘనా, ఐవరీ కోస్ట్‌ దేశాలు దీనికి సరిహద్దులు.
* బర్కీన ఫాసో అంటే ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఆనెస్ట్‌ పీపుల్‌’ అని అర్థం.
* ఇది ఆఫ్రికా ఖండంలో సురక్షితమైన దేశాల్లో ఒకటి.
* 19వ శతాబ్దం చివరి వరకూ మోస్సీ రాజ్యం పాలనలో ఉండేదీ దేశం. ఆ తర్వాత ఫ్రెంచ్‌ వారు వచ్చి ఈ దేశాన్ని తమదంటూ ప్రకటించి రాజధానిని ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆగస్టు 5, 1960న ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది.

దేశం: బర్కీన ఫాసో
రాజధాని: వాగడూగో
విస్తీర్ణం: 2,74,200 చదరపు కిలోమీటర్లు
జనాభా: 2,01,07,509
భాష: ఫ్రెంచ్‌
కరెన్సీ: వెస్ట్‌ ఆఫ్రికన్‌ సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌ 

* మొదట్లో ఈ దేశాన్నే ‘అప్పర్‌ వోల్టా’ అని పిలిచేవారు. 1984 నుంచి బర్కీన ఫాసోగా పేరు మార్చారు.
* ఇక్కడ 60 స్థానిక తెగలున్నాయి. ప్రతి తెగకూ ప్రత్యేక భాషా సంప్రదాయాలు ఉన్నాయి. అతిపెద్ద తెగ మోస్సీ.
* పేద దేశాల్లో ఇదీ ఒకటి.
* డ్రమ్‌, సంగీత కళలు ఇక్కడి సంస్కృతిలో భాగం.
* పీనట్స్‌, పత్తి, ఆవాల్ని ఎక్కువగా పండిస్తారు.
* ప్రపంచంలో పురాతనమైన నగరాల్లో ఈ దేశ రాజధాని ‘వాగడూగో’ ఒకటి.
* రకరకాల సహజవనరులు ఇక్కడి ప్రత్యేకత. మాంగనీస్‌, సున్నపు రాయి, ప్యూమిక్‌, ఉప్పు...  మొదలైనవి. పాడిపంటలు ఎక్కువే ఇక్కడ.
* ‘డబ్ల్యూ’ అనే ఉద్యానవనం ఈ దేశంతో పాటు బెనిన్‌, నైగర్‌ దేశాల మధ్య విస్తరించి ఉంటుంది.
* ఈ దేశంలో ఓ రకమైన సిల్క్‌ లైనింగ్‌ క్లాత్‌ని పందుల చెవుల నుంచి తయారుచేస్తారు.
* సాకర్‌, హ్యాండ్‌బాల్‌, సైక్లింగ్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌ ఇక్కడి ప్రధాన క్రీడలు.

* బంగారం.. ఈ దేశం ఎగుమతి చేసేవాటిల్లో ప్రధానమైంది. దీని తర్వాత పత్తి, జంతువుల ఉత్పత్తులు ఉంటాయి.

* 497 జాతుల పక్షులున్నాయీ దేశంలో. ఏనుగులు, సింహాలు, చిరుతపులులు ఎక్కువ. వృక్షజంతు సంపదల సంరక్షణ కోసం ప్రత్యేక ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు.

* ఇక్కడ రెండు సంవత్సరాలకోసారి ‘స్పిరిట్‌ ఆఫ్‌ మాస్క్‌’ అనే పండగ జరుగుతుంది. చిత్ర విచిత్రమైన వేషాల ముసుగులు వేసుకుని అంతా సంబరాలు
చేసుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని