చెరువులు.. దారులు.. అన్నీ ఇళ్లలోనే!

అనగనగా ఓ ఎడారుంది... అక్కడ చాలానే నివాసాలున్నాయి... అవి భలే తమాషాగా ఉంటాయి.... ఎక్కడ? ఏంటా సంగతులు? ఎడారంటే చూసినంత లెక్క ఇసుకతిన్నెలు.... అక్కడక్కడా ఇళ్లు.... అరుదుగా ముళ్ల మొక్కలు... ఇవే మనకు గుర్తొస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా ఓ ఎడారి ఊరుంది. దానిలో అంతే చిత్రమైన ఇళ్లున్నాయి.

Published : 04 Apr 2018 01:22 IST

చెరువులు.. దారులు.. అన్నీ ఇళ్లలోనే!

అనగనగా ఓ ఎడారుంది... అక్కడ చాలానే నివాసాలున్నాయి... అవి భలే తమాషాగా ఉంటాయి.... ఎక్కడ? ఏంటా సంగతులు?

డారంటే చూసినంత లెక్క ఇసుకతిన్నెలు.... అక్కడక్కడా ఇళ్లు.... అరుదుగా ముళ్ల మొక్కలు... ఇవే మనకు గుర్తొస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా ఓ ఎడారి ఊరుంది. దానిలో అంతే చిత్రమైన ఇళ్లున్నాయి.

గమ్మత్తయిన ఆ వివరాలన్నీ మనమూ తెలుసుకుందాం.

* ఈ ఎడారి ఊరు పేరు ఘాడమ్స్‌. ‘పర్ల్‌ ఆఫ్‌ ద డెసర్ట్‌’ అని దీనికి పేరు. లిబియాలోని నాలట్‌ జిల్లాలో ఉంటుందిది.

* ఇక్కడ ఇళ్లన్నీ తేనె పట్టు మాదిరిగా ఉంటాయి.

* ఇళ్లన్నీ కలిసి కలిసి అంతస్తుల్లో భలే గమ్మత్తుగా ఉంటాయి.

* ఈ ఊరంతా వీటిల్లోనే ఉంటుంది. ఇంక బజార్లు, పబ్లిక్‌ ప్రాంతాలు, చెరువులు... ఇలా అన్నీ వీటిలోనే ఉంటాయి మరి.

* ఒక ఇల్లుకు ఇంకో ఇల్లు అతుక్కునేట్టు వరుసగా కట్టుకున్నారు వీటిని. అయితే అన్ని ఇళ్లలోనూ రెండంతస్తులు తప్పనిసరి.

* కింద అంతస్తు(గ్రౌండ్‌ ఫ్లోర్‌)లో పచారీ సామాన్లు అవీ దొరికే దుకాణాలుంటాయి.

* రెండో అంతస్తు అంతా నివాసాలుంటాయి. పడకగది, వంటగది ఇలా అన్నీ విడివిడిగానే ఉన్నా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి లోపలే దారులుంటాయి. ఆ పైన మిద్దె మీద అంతా ఖాళీగా ఉంటుంది. వీటిలో ఉండే ఆడవాళ్లు గాలి పీల్చుకోడానికి, సరదాగా మాట్లాడుకోవడానికి పైకి వస్తుంటారు.

* ఇక రోడ్లు, ఇంటి నుంచి ఇంకో ఇంటికి దారులు అన్నీ వీటిల్లోపలే ఉంటాయి. ఇంటిపైకప్పుల్ని కలుపుతూ నడక దారులుంటాయి.

* అచ్చం తేనెటీగల కాలనీలో ఉన్నట్లే వీళ్లూ ఊరు మొత్తాన్ని వీటిల్లోనే నిర్మించుకున్నారు.

* ఈ ఊరిలో దాదాపు పది వేల మంది నివసిస్తున్నారు.

* మట్టి ఇటుకలు, చెట్ల దుంగల్ని ఉపయోగించి వీటినిలా చిత్రంగా కట్టుకున్నారు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచీ ఇవి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అయితే ఇప్పుడు వాడుకలో ఉన్నవన్నీ ఆ తర్వాత్తర్వాత నిర్మించినవేనట.

* 1986లో ఈ ఊరిలోని పాత భాగాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా  గుర్తించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు