స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఇక్కడా ఉంది!

ఐరోపా ఖండంలో అత్యుత్తమ నగరాల్లో పారిస్‌ ఒకటి. ఇది ఫ్రాన్స్‌ దేశ రాజధాని. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో పారిస్‌ ఏర్పడింది. అంతకు ముందు దీన్ని లుటేటియా అని పిలిచేవారు. దానిలో పార్సీ అనే చిన్న ప్రాంతం ఉండేది. దాని పేరు నుంచే ‘పారిస్‌’ వచ్చింది.

Published : 28 Apr 2018 01:32 IST

మహా నగరం
స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఇక్కడా ఉంది!

 పారిస్‌

నగరం: పారిస్‌
దేశం: ఫ్రాన్స్‌
జనాభా: 22,06,488
విస్తీర్ణం: 105.4చదరపు  కిలోమీటర్లు

ఐరోపా ఖండంలో అత్యుత్తమ నగరాల్లో పారిస్‌ ఒకటి. ఇది ఫ్రాన్స్‌ దేశ రాజధాని. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో పారిస్‌ ఏర్పడింది. అంతకు ముందు దీన్ని లుటేటియా అని పిలిచేవారు. దానిలో పార్సీ అనే చిన్న ప్రాంతం ఉండేది. దాని పేరు నుంచే ‘పారిస్‌’ వచ్చింది.

* మామూలుగా ఈ నగర విస్తీర్ణం 105 చదరపు కిలోమీటర్లని చెబుతారు. కానీ దీని పరిధిలో ఉన్న అర్బన్‌, మెట్రో ప్రాంతాలన్నింటితో కలిపితే చాలా పెద్దది.

* ఏటా కోటీ ముప్ఫై లక్షల మందికి పైగా ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు.
* ఇక్కడున్న అతి ప్రాచీనమైన వంతెన పేరు ‘న్యూబ్రిడ్జ్‌’. 16వ శతాబ్దంలో కట్టారు.

* ఇక్కడున్న మెట్రో వ్యవస్థ ప్రపంచంలోని పెద్ద ప్రజా రవాణా వ్యవస్థల్లో నాలుగోది. దీనికి 302 స్టేషన్లున్నాయి.
* చాలా రైల్వే స్టేషన్లలో పియానోలు ఉంటాయి. వాటిని ఎవరైనా వాయించవచ్చు.

* స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ పేరు గుర్తురాగానే మనందరికీ అమెరికాలోని న్యూయార్కే గుర్తొస్తుంది. కానీ స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీలు పారిస్‌లోనే ఐదున్నాయి. ఫ్రాన్స్‌ మొత్తంలో పదున్నాయి. అమెరికాకు ఆ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిందీ ఫ్రాన్సే.

* వీరు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తారు. సైకిళ్లు బాగానే తొక్కుతారు. అందుకే ఇక్కడ 500 కిలోమీటర్లకుపైగా దూరం బైక్‌ ట్రాక్‌లున్నాయి.

* ఇక్కడ నాలుగులక్షల డెబ్భైవేల చెట్లున్నాయి. లెక్కలు పక్కాగా ఉండేందుకు వాటినీ లెక్కిస్తారిక్కడ.

* ఈ నగరం మొత్తంలో చాలా తలలేని విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే ఆ విగ్రహంలోని మనిషి పేరు డెనిస్‌. దాదాపు 1500 ఏళ్ల క్రితం రోమన్‌లు క్రైస్తవ మతం తీసుకోమంటే ఆయన ఒప్పుకోలేదు. దీంతో వారు ఆయన తలను నరికివేశారు. ఇలా ఇక్కడ దాదాపుగా 2000 మంది ప్రాణత్యాగం చేశారు. అందుకు గుర్తుగా డెనిస్‌ విగ్రహాల్నిలా ప్రతిష్ఠించారు.

సినిమాలకు ప్రసిద్ధి 

* ఇక్కడ ఏకంగా నాలుగువందలకుపైగా సినిమా తెరలున్నాయి. ఇందులో వంద ప్రభుత్వానివే!

* ఇక్కడి వీధుల్లో సగటున చూసుకుంటే రోజుకు పది వరకూ సినిమా షూటింగ్‌లు జరుగు తుంటాయి. చిత్రాలుకాకుండా డాక్యుమెంటరీలు, టీవీ షోల షూట్లయితే అనేకం.

* ఎందుకంటే ఈ నగర వీధుల్లో షూటింగ్‌ ఉచితం. కాకపోతే ఉద్యానవనాలు, స్విమ్మింగ్‌పూల్‌లు, మ్యూజియాల్లాంటి వాటి దగ్గర జరిగితే మాత్రం నగర ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుంది.

ఈఫిల్‌ టవర్‌

* పారిస్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఈఫిల్‌ టవరే. దీని నిర్మాణం 1887లో మొదలై 1889లో పూర్తయ్యింది.
* 1889లో అక్కడ జరిగిన వరల్డ్‌ ఫెయిర్‌కి గుమ్మం(ఎంట్రన్స్‌)లా ఉంచేందుకు దీన్ని తయారు చేశారు. నీ దీని రూపశిల్పి  స్టీఫెన్‌ సువెస్ట్రే.

* ముందు దీన్ని కొన్ని రోజుల్లోనే తీసేయాలని అనుకున్నారు. అయితే అది దశాబ్దాలు గడిచినా చక్కగా ఉంది.
* ఫ్రాన్స్‌ సంస్కృతికి ఇది గుర్తుగా భావించడం మొదలుపెట్టారు.

* పైగా పర్యాటక ఆకర్షణగానూ మారడంతో దీనికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ సంరక్షిస్తున్నారు.
* ఇది 1,063 అడుగుల పొడవుంటుంది. 81 అంతస్తులుంటాయి దీనిలో.

ఇది విన్నారా!

మనందరికీ పారిస్‌ అంటే ఈ ఫ్రాన్స్‌ రాజధానే గుర్తొస్తుందిగానీ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 38  పారిస్‌లున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు