రాళ్లు పుట్టి పెరుగుతాయిక్కడ!

సముద్రపు అలలు ఎగసిపడుతుంటే.. ఆ ఇసుక తిన్నెల్లో ఆడుకోవడం మనకు చెప్పలేనంత ఇష్టం. మరేమో ఓ చోట చక్కని బీచ్‌ ఉంది. అక్కడ ఇసుకలో కొన్ని రాళ్లు పుట్టాయి.. ఇప్పుడు కాదు. కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితం. వాటిని అదాటున చూస్తే పేద్ద బంతులేమైనా దొర్లిపోతున్నాయా? అనే భ్రాంతి కలుగుతుంది. అయితే ఇవన్నీ అసలు మనం అనుకునే రాళ్లే కాదట.

Published : 07 May 2018 01:15 IST

రాళ్లు పుట్టి పెరుగుతాయిక్కడ!

ఓ అందమైన బీచ్‌... అందులో అంతే అందమైన రాళ్లు... చూడ్డానికి పేద్ద బంతుల్లా అనిపిస్తాయి.. అయితే వాటి వెనుక ఓ కథుంది... ఏంటో? అదేమో?

ముద్రపు  అలలు ఎగసిపడుతుంటే.. ఆ ఇసుక తిన్నెల్లో ఆడుకోవడం మనకు చెప్పలేనంత ఇష్టం. మరేమో ఓ చోట చక్కని బీచ్‌ ఉంది. అక్కడ ఇసుకలో కొన్ని రాళ్లు పుట్టాయి.. ఇప్పుడు కాదు. కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితం. వాటిని అదాటున చూస్తే పేద్ద బంతులేమైనా దొర్లిపోతున్నాయా? అనే భ్రాంతి కలుగుతుంది. అయితే ఇవన్నీ అసలు మనం అనుకునే రాళ్లే కాదట.
* అసలు ఈ బీచ్‌ ఎక్కడుందంటే న్యూజీలాండ్‌ దేశంలో. అక్కడ మోరీకీ అనే ఊరుంది. దానికి ఆనుకుని సముద్ర తీరముంది.
* ఆ బీచ్‌తోపాటు అక్కడ 19 కిలోమీటర్ల మేర అంతా చిత్రమైన ఈ తీరు కనిపిస్తుంది.
* ఇప్పుడు అదో సైంటిఫిక్‌ రిజర్వ్‌. ఇక్కడ రాళ్లు పుట్టి చిన్న చిన్నగా పెరుగుతుంటాయి.

* అవి గుండ్రంగానే కాదు, దీర్ఘవృత్తాకారంలోనూ ఉంటాయి. పది మీటర్ల వ్యాసార్థం వరకూ ఉంటాయి.
* అలా ఇక్కడున్న రాళ్లల్లో అతి పెద్దది ఏడు టన్నుల బరువుంది. 40 లక్షల ఏళ్లుగా ఇది ఎదుగుతూనే ఉంది.
* అసలిక్కడ ఇలాంటి రాళ్లు ఎందుకు ఏర్పడుతున్నాయబ్బా అని శాస్త్రవేత్తలకు తెగ అనుమానం వచ్చేసింది. అందుకే ఈ రాళ్లపై బోలెడు పరిశోధనలు చేసేశారు.
* అప్పుడు వాళ్లకు తెలిసిందేంటంటే.. అవి అచ్చంగా బురద, మెత్తటి ఇసుకల మిశ్రమంతో ఏర్పడ్డ బురదరాళ్లన్నమాట.

* దాంట్లో కాల్సైట్‌ అనే ఖనిజం కరిగి ఉంది. ఇంకా మెగ్నీషియం, ఇనుము, కార్బన్‌లాంటివీ ఉన్నాయి. దాంతో ఈ రాళ్లు గుండ్రంగా, గట్టిగా ఏర్పడటానికి ఇవి సిమెంటులా ఉపయోగపడుతున్నాయని తేల్చారు.
* అలల తాకిడితో భూమిలో ఒత్తిడి ఏర్పడుతోందట. దీంతో ఈ బురద మట్టి కొంచెం కొంచెంగా పైకి పొంగి మేట వేయడంతో ఈ రాళ్లు ఏర్పడుతున్నాయన్నారు. అయినా ఇందులో ఇంకా ఏదో మిస్టరీ ఉందని పరిశోధనలు కొనసాగిస్తున్నార్ట.
* ఇక్కడ ఇలాంటి రాళ్లలో 50లక్షల ఏళ్ల క్రితంవీ ఉన్నాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని