సిడ్నీ.. ఆయన పేరే!

ఆస్ట్రేలియా దేశంలో న్యూసౌత్‌ వేల్స్‌ అని ఓ రాష్ట్రం ఉంది. దాని రాజధానే సిడ్నీ. ఈ దేశ తూర్పు తీరంలో ఉంటుందీ నగరం.సిడ్నీకి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటికేడాది పెరుగుతూనే ఉంది. కోటీ యాభై లక్షల మందికి పైగా స్వదేశీ, విదేశీయులు ఇక్కడికి వస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద చేపల సంతల్లో మూడోది ఇక్కడే ఉంది. ఇక్కడి జార్జ్‌ స్ట్రీట్‌ ఈ దేశంలోనే అతి పురాతనమైన వీధి. అందమైన బీచ్‌లు, ఒపేరా హౌస్‌, హార్బర్‌ బీచ్‌లాంటి వాటికి ఎంతగానో ఆకర్షితులవుతున్నారు.

Published : 12 May 2018 01:30 IST

సిడ్నీ.. ఆయన పేరే!  

ఆస్ట్రేలియా దేశంలో న్యూసౌత్‌ వేల్స్‌ అని ఓ రాష్ట్రం ఉంది. దాని రాజధానే సిడ్నీ. ఈ దేశ తూర్పు తీరంలో ఉంటుందీ నగరం.

నగరం: సిడ్నీ
దేశం: ఆస్ట్రేలియా
విస్తీర్ణం: 12,367.7 చ.కిలోమీటర్లు
జనాభా: 5,131,326
సిడ్నీకి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటికేడాది పెరుగుతూనే ఉంది. కోటీ యాభై లక్షల మందికి పైగా స్వదేశీ, విదేశీయులు ఇక్కడికి వస్తున్నారు.
*  ప్రపంచంలో ఉన్న అతి పెద్ద చేపల సంతల్లో మూడోది ఇక్కడే ఉంది.
* ఇక్కడి జార్జ్‌ స్ట్రీట్‌ ఈ దేశంలోనే అతి పురాతనమైన వీధి.
* అందమైన బీచ్‌లు, ఒపేరా హౌస్‌, హార్బర్‌ బీచ్‌లాంటి వాటికి ఎంతగానో ఆకర్షితులవుతున్నారు.

*మొదట దీన్ని న్యూ అల్బినో అని పిలిచేవారు. తర్వాత బ్రిటిష్‌ లార్డ్‌.. సిడ్నీ గౌరవార్థం ఆయన పేరునే దీనికి పెట్టారు. అయితే అల్బినో అనే పేరు ఇప్పుడు అక్కడ ఒక వీధికి ఉంది.
* క్కడ విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. ఇంగ్లిష్‌, అరబిక్‌, మాండ్రిన్‌, గ్రీకు, వియత్నామీస్‌లను ఎక్కువగా మాట్లాడతారు.
*ర్తక వ్యాపారాలతో ఇది ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక కేంద్రంగా పేరొందింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలోనూ దీని పాత్ర కీలకం. ఇంగ్లండ్‌ నుంచి ఓడల ద్వారా వచ్చిన ఇంగ్లిష్‌వాళ్లు మొదటిగా ఇక్కడికే చేరారు.
*సిడ్నీ ప్రధాన నగరంలో కాకుండా ఆ చుట్టుపక్కల(సబర్బన్స్‌)లో నివసించేవాళ్లని సిడ్నీ సైడర్స్‌ అంటారు.
*హజంగా ఏర్పడ్డ లోతైన హార్బర్లలో ప్రపంచంలోనే మొదటిది సిడ్నీ హార్బర్‌.
*సిడ్నీ టవర్‌ ఇక్కడ అతి పొడవైనది. ఆస్ట్రేలియాలో ఉన్న వాటిలో రెండోది.
*క్రికెట్‌ అంటే సిడ్నీలో నివసించే వారికి చాలా అభిమానం. 2014లో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో కొన్ని మ్యాచ్‌లకు వేదికయ్యింది.
* క్కడి హార్బర్‌ బీచ్‌ వంతెన గురించి వినే ఉంటారు. పొడవైన ఉక్కు ఆర్చితో కట్టిన బ్రిడ్జిగా ఇది గిన్నిస్‌ రికార్డును కొట్టింది. 1932లో దీన్ని ప్రారంభించారు.   స్థానికులంతా ముద్దుగా దీన్ని ‘ద కోట్‌ హ్యాంగర్‌’ అని పిలుచుకుంటారు.

వెలుగులు.. వేడుకలు!  

నూతన సంవత్సర వేడుకలనగానే అందరి చూపూ సిడ్నీవైపే.
*  ఎందుకంటే ఇక్కడ హార్బర్‌బీచ్‌ సమీపంలో ఏటా అద్దిరిపోయే సంబరాలుంటాయి.
*  టపాకాయల వెలుగుల్లో, అవి చేసే శబ్దాల హోరులో సిడ్నీ హుషారెక్కిపోతుంది.
*  పైగా టైమ్‌జోన్‌ల ఆధారంగా ముందుగా నూతన సంవత్సరాన్ని స్వాగతించే దేశాల్లో ఇదీ ఒకటి. అందుకే ఈ హడావిడంతా.
*  ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా పర్యాటకులు ముందుగానే ఇక్కడికి చేరిపోతుంటారు.
*  ఏటా వీటిలో పదిహేను లక్షల మందికిపైగా పాల్గొంటున్నారట.
*  వీటి కోసం వీరు ఆరు మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లకుపైగా ఖర్చు పెడుతున్నారు. అయితే దీని వల్ల స్థానికంగా 156 మిలియన్లకుపైగా విలువైన వ్యాపారం జరుగుతోందట.

ఆకర్షించేస్తాయ్‌!

* దీనికి దగ్గరగానే సిడ్నీ ఒపేరా హౌస్‌ ఉంటుంది. భవనం ఆకారాన్ని బట్టే బోలెడంత ప్రత్యేకతను తెచ్చిపెట్టుకుంది. సాంస్కృతిక, పబ్లిక్‌ కార్యక్రమాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 1973లో దీన్ని ప్రారంభించింది. మిలమిలా మెరిసే పదిలక్షల టైల్స్‌ని దీని కప్పుపై వాడారు. అవి 15 టన్నుల బరువున్నాయట.యునెస్కో దీన్ని2007లో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది. ఏటా దాదాపుగా ఎనభై లక్షల మంది దీన్ని సందర్శిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని